ఓటు హక్కు లేదా?.. అయితే సెక్స్‌కు 'నో' చెప్పండి: కెన్యా ఎంపీ

'ఓటు హక్కు లేని భర్తతో శృంగారాన్ని నిరాకరించండి..' అంటూ ఎంపీ మిషీ మోకో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మొంబాసా పట్టణంలో ప్రచారం చేస్తున్నారు.

మొంబాసా/కెన్యా: ఎన్నికలు సమీపిస్తున్నాయంటే.. రాజకీయ ప్రచారం ఎంతగా కొత్తపుంతలు తొక్కుతుందో అందరికీ తెలిసిందే. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతలు చేసే జిమ్మిక్కులకు తోడు.. ఓటు హక్కు లేనివారిని చైతన్యవంతం చేసేందుకు తెరపైకి వచ్చే వినూత్న కార్యక్రమాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.

ప్రస్తుతం కెన్యాలోను ఎన్నికల వాతావరణం కొనసాగుతుండటంతో.. అక్కడి ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. దాదాపు 90లక్షల మంది కెన్యా ప్రజలు అన్ని అర్హతలు ఉండి కూడా ఓటుకు దూరంగా ఉన్నారు. దీంతో వారందరిని చైతన్యవంతం చేసే క్రమంలో ఓ మహిళా ఎంపీ వినూత్న ప్రచారానికి తెరదీశారు.

'ఓటు హక్కు లేని భర్తతో శృంగారాన్ని నిరాకరించండి..' అంటూ ఎంపీ మిషీ మోకో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మొంబాసా పట్టణంలో ప్రచారం చేస్తున్నారు. ఓటు హక్కు నమోదు చేయించుకోని భర్తలు ఈ చర్యతో దారిలోకి వస్తారన్నది ఎంపీ గారి ఆలోచన.

No sex for Kenyan men without voting cards, says Mombasa woman representative Mishi Mboko

అందుకే మహిళలు శృంగారాన్ని ఓ ఆయుధంగా వాడుకుని భర్తల్లో చైతన్యం తీసుకురావాలని ఎంపీ మెషీ మోకో అక్కడి మహిళలకు పిలుపునిస్తున్నారు. ఓటర్‌ ఐడీ చూపించేంతవరకు భర్తతో శృంగారానికి 'నో' చెప్పండని మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అందరి సంగతి సరే.. తన భర్త గురించి కూడా చెప్పకపోతే ఎలా అనుకున్నారో ఏమో!.. 'నా భర్తకు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు ఓటర్‌ ఐడీ ఉంది!' అని ఎంపీ పేర్కొనడం గమనార్హం.

కాగా, ఆగస్టు 8న కెన్యాలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో సుమారు 90లక్షల మంది ప్రజలు అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో వారిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంపీ మిషీ మోకో ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+