సబ్ వే రైలు తలుపుల మద్య తల ఇరుక్కొని మహిళ ఇబ్బందులు
న్యూయార్క్: ఓ మధ్య వయస్సున్న మహిళ తల అనుకోకుండా సబ్ వే రైలు తలుపుల మధ్య చిక్కుకొంది. తలతోపాటు, హ్యాండ్ బ్యాగ్ కూడ తలుపుల మధ్యే చిక్కుకొని సాయం కోసం ఆర్థించినా ఒక్కరూ కూడ సహయం చేయలేదు.
న్యూయార్క్ లోని రైల్వేస్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ మధ్య వయస్సున్న మహిళ తల అనుకోకుండానే సబ్ వే రైలు తలుపుల మద్య ఇరుక్కుపోయింది.
దీంతో ఆమె భయంతో తనకు సహయం చేయాలని కోరింది. అయితే ఆమెను చూస్తూ అందరూ వెళ్ళిపోయారు కాని, ఆమెకు మాత్రం సహాయం మాత్రం చేయలేదు.

రైల్వే సిబ్బంది యూనిఫామ్ వేసుకొన్న ఓ మహిళ కూడ ఆమెను చూసి పట్టించుకోలేదు. సాటి మనిషి ఇబ్బంది పడుతోంటే కనీసం పట్టించుకోకుండా వదిలేశారు.
అంతేకాదు రైల్వే సిబ్బంది యూనిఫామ్ లో ఉండి కూడ ఓ మహిళ ప్రమాదంలో ఉందని కూడ చూడకుండా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఈ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. దీనిని ఇప్పటికే 12 లక్షలకు పైగా చూశారు.
చాలాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి ఆమెను రక్షించాడు.దీంతో ఆమె తలుపుల సందు నుండి బయటపడింది.












Click it and Unblock the Notifications