ఈ టైమ్ లో కిమ్ ఎంటర్ అయితే ఉంటది నా సామిరంగ- ఊ అంటే చాలు
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
గతంలో కిమ్ ప్రతిజ్ఞ..
ఈ పరిణామాల మధ్య ఈ యుద్ధంలో ఉత్తర కొరియా ఎంటర్ అయితే ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమౌతోంది. ఇజ్రాయెల్‌తో ఘర్షణలు పెరిగితే ఇరాన్‌కు సైనిక మద్దతు ఇస్తానని కిమ్ జొంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు గతంలో. అక్కడితో ఆగలేదాయన. ఇజ్రాయెల్‌ను తుడిచిపెట్టడానికి తమ వద్ద ఉన్న ఒక్క క్షిపణి సరిపోతుందని అప్పట్లో ప్రకటించారు కూడా. కిమ్ మాటల్లో ఆవేశం కనిపిస్తోన్నప్పటికీ- ఆచరణాత్మక సహనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

వ్యూహాత్మక మౌనాన్ని
దక్షిణ కొరియాపై ప్రస్తుతం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తోన్నారు. కొరియా పునరేకీకరణ ఆలోచనను విడిచిపెట్టి, శాశ్వత శతృత్వ వైఖరిని అవలంబిస్తున్నారు. అదే సమయంలో, అమెరికా పట్ల షరతులతో కూడిన చర్చలకూ ద్వారాలు తెరిచే ఉంచారని అరైజ్ న్యూస్ వెల్లడించింది. కిందటి నెల చివరలో జరిగిన వర్కర్స్ పార్టీ తొమ్మిదో కాంగ్రెస్ తర్వాత ఆయన చేసిన ప్రకటనలు, చర్యలు ఈ కొత్త వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.
శక్తిమంత అణ్వాయుధ దేశంగా..
ఉత్తర కొరియాను అణ్వాయుధ దేశంగా లాంఛనంగా మార్చాలనేదే ఆయన ప్రణాళిక. ఈ ఏడాది ప్రారంభం నాటికి భారీగా క్షిపణి, షెల్ ఉత్పత్తిని విస్తరించాలని కిమ్ ఆదేశించారు. అమెరికా ప్రధాన భూభాగాన్ని ఛేదించగల వ్యవస్థలు, దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా వ్యూహాత్మక అణ్వస్త్రాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు.
అంతర్జాతీయ ఘర్షణలలో కిమ్ జోక్యం..
అంతర్జాతీయ ఘర్షణలలో కిమ్ జోంగ్ ఉన్ జోక్యం ఉంది కూడా. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా ప్రవేశించింది ఉత్తర కొరియా. రష్యాకు మద్దతుగా దాదాపు 12,000 మంది సైనికులు, లక్షల కొద్దీ మందుగుండు సామాగ్రిని పంపింది. కొరియన్ పీపుల్స్ ఆర్మీ (KPA) సైనిక బలం అపారం. 1.3 మిలియన్ల క్రియాశీల సిబ్బంది దీని సొంతం. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటి కేపీఏ.
సైన్యంలో పని చేయడం తప్పనిసరి..
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారం 6,00,000 మంది రిజర్విస్టులు, 5.7 మిలియన్ల వర్కర్/పెసెంట్ రెడ్ గార్డ్ రిజర్విస్టులు ఉత్తర కొరియాకు ఉన్నారు. కొరియా సైన్యం, వైమానిక, నౌకాదళాలు, అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణులతో కూడిన వ్యూహాత్మక దళాలుగా విభజించారు. ఉత్తర కొరియాలో 17-30 ఏళ్ల పురుషులు 3-12 ఏళ్ల సైన్యంలో పని చేయడం తప్పనిసరి. వైమానిక దళంలో 1,10,000, నౌకాదళంలో 60,000 మంది సిబ్బంది ఉన్నారని అంచనా.
షార్ట్ రేంజ్ నుండి అమెరికా వరకు..
ప్రపంచంలో అణ్వస్త్రాలు కలిగిన తొమ్మిది దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. షార్ట్ రేంజ్ నుండి అమెరికా వరకు చేరగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో సహా పలు అణు-మోసుకెళ్లగల క్షిపణులను అభివృద్ధి చేశారు కిమ్ జొంగ్. 6,900కు పైగా ట్యాంకులు, సాయుధ వాహనాలు ఉన్నాయి. వైమానిక దళంలో 400కి పైగా ఫైటర్, 80 తేలికపాటి బాంబర్లు, 200కు పైగా రవాణా విమానాలు ఉన్నాయని అంచనా.
-
పర్షియన్ గల్ఫ్ దేశాన్ని తుడిచి పెడతాం- ఇంకో రెండు, మూడు వారాలే: తేల్చి చెప్పిన ట్రంప్ -
పేలుతున్న పెట్రో ధరల బాంబు -
పోర్ట్ సిటీలో భారీ భూకంపం -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications