యుద్ధంలోకి నార్త్ కొరియా .. అమెరికాకు వార్నింగ్.. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా..!
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 9 రోజులుగా యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది. అమెరికా ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇటీవల జూన్ 21 న ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దీంతో ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి.
అయితే అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. ఈ మేరకు అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్ని అటు ప్రపంచ దేశాలు సైతం ఖండించాయి. ఈ క్రమంలో అమెరికా వైఖరిని ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుబట్టింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు ఇజ్రాయెల్, అమెరికానే కారణం అని ఉత్తర కొరియా మండిపడింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ప్రపంచ దేశాల ముందు నిలదీయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇరాన్ కు మద్దతుగా నిలిచారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. అమెరికా చర్యలను ఖండించారు. ప్రాదేశిక హక్కులు, ఆ దేశ సార్వభౌమాధికారానికి ఇజ్రాయెల్, అమెరికా తీవ్ర ఆటంకం వహించాయని కిమ్ మండిపడ్డారు.
మరోవైపు జూన్ 22 న ఇరాన్ పై మరోసారి భారీ స్థాయిలో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ లోని ఆరు మిలిటరీ ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అంతేకాక 20 ఫైటర్ జెట్స్ ఇరాన్ లోని కెర్మాన్ షా, టెహ్రాన్, హమెదాన్ ప్రాంతాలను నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు చెందిన ఎఫ్-14, ఎఫ్-5, ఏహెచ్-1 హెలికాప్టర్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
North Korea 'strongly condemns' Trump's bombing of Iran
— ℂ𝕙𝕖 𝔾𝕦𝕖𝕧𝕒𝕣𝕒 ★ (@cheguwera) June 23, 2025
US 'encourages Israel's territorial expansion'?#Iran #Israel #MiddleEast #Gaza #USA #Russia pic.twitter.com/pQKOGF9T9f
ఇదిలా ఉంటే ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచ ఆర్థిక రంగాన్నే స్తంభింపజేసేలా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది ఇరాన్.ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేసేందుకు సిద్దం అవుతోంది. ఏ క్షణమైనా ఇరాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే హార్మోజ్ జల సంధిని మూసివేస్తాం అని ఇరాన్ ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా వెల్లడించారు.












Click it and Unblock the Notifications