Nostradamus: నాస్ట్రాడమస్ 2025 భవిష్యవాణి: ఆ భయంకర వ్యాధి తిరిగి రాబోతుందా?
Nostradamus: ఫ్రెంచ్ పండితుడు నాస్ట్రాడమస్ చేసిన భవిష్యత్ అంచనాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. గత 400 ఏళ్లలో ఆయన చెప్పిన 800కు పైగా భవిష్యవాణులు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు గురించి చెప్పిన నాస్ట్రాడమస్ భవిష్యవాణి మళ్లీ తెరపైకి వచ్చింది. అది కొత్త ఊహాగానాలకు దారితీస్తోంది. చరిత్రలో అత్యంత ప్రసిద్ధ భవిష్యవాణి చెప్పిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన నాస్ట్రాడమస్.. ఈ సంవత్సరం కోసం కొన్ని భయంకరమైన భవిష్యవాణులను చేశారు. ఆయన గతంలో చెప్పిన ఎన్నో విషయాలు నిజం కావడంతో ప్రస్తుతం ఆయన తాజా భవిష్యవాణులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి.
ఈ సంవత్సరం పెను వినాశనం
నాస్ట్రాడమస్ తన పుస్తకం 'లెస్ ప్రోఫటీస్'లో ఈ సంవత్సరం గురించి రెండు ప్రధాన, భయంకరమైన భవిష్యవాణులను చెప్పారు. అవి..
యూకే, యూరోపియన్ యూనియన్ మధ్య ఉద్రిక్తతలు: నాస్ట్రాడమస్ ప్రకారం.. బ్రిటన్(యూకే), యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరతాయి. ఇది కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే కాకుండా తీవ్రమైన సంక్షోభానికి దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

భయంకరమైన ప్లేగు వ్యాధి తిరిగి ప్రబలిస్తుంది: నాస్ట్రాడమస్ మరో అత్యంత భయానకమైన భవిష్యవాణిని చెప్పారు. గతంలో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ప్లేగు వంటి ఒక ప్రాణాంతక వ్యాధి మళ్లీ ప్రబలవచ్చని నాస్ట్రాడమస్ పేర్కొన్నారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ఆయన తన భవిష్యవాణిలో పరోక్షంగా తెలిపారు.
ఎవరు ఈ నాస్ట్రాడమస్?
నాస్ట్రాడమస్ అసలు పేరు మిచెల్ డి నోస్ట్రెడామ్. నాస్ట్రాడమస్ డిసెంబర్ 14, 1503న ఫ్రాన్స్‌లో జన్మించారు. 16వ శతాబ్ధంలో ఆయన ప్రసిద్ధ భవిష్యవాణి చెప్పినవారు, జ్యోతిష్యుడు, వైద్యుడు. జులై 2, 1566న 62 ఏళ్ల వయస్సులో ఫ్రాన్స్‌లోనే ప్రాణాలు విడిచారు. ఆయన 'లెస్ ప్రోఫెటీస్' అనే పుస్తకంలో తన భవిష్యవాణులను రాశారు. అవి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఆయన చెప్పిన విషయాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
నాస్ట్రాడమస్ చెప్పిన అనేక భవిష్యవాణులు గతంలో నిజమయ్యాయి. ఫ్రెంచ్ విప్లవం, నెపోలియన్ బోనాపార్టే ఎదుగుదల, రెండవ ప్రపంచ యుద్ధం, హిట్లర్ ఎదుగుదల, అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడి వంటి చారిత్రక సంఘటనలను ఆయన వందల ఏళ్ల ముందే ఊహించి చెప్పడం విశేషం. అయితే, ఆయన చెప్పిన భవిష్యవాణులు అస్పష్టంగా, క్వాట్రైన్‌ల రూపంలో ఉండటంతో, వాటికి అనేక రకాల వివరణలు ఉన్నాయి. కానీ, అవి చాలాసార్లు నిజ జీవిత సంఘటనలతో సరిపోలడం వల్ల అవి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications