వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాను తిట్టిపోసిన రోడ్రిగో: ఫిలిప్పీన్స్ పర్యటన రద్దు

|
Google Oneindia TeluguNews

వియన్‌టైన్: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఒబామాను ఉద్దేశించి బూతులు తిట్టారు. 'ఒబామా ఓ వెలయాలి కొడుకు' అంటూ దారుణంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఒబామా రోడ్రిగోతో తలపెట్టిన తన తొలి సమావేశాన్ని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు.

లావోస్‌లో దక్షిణాసియా దేశాధినేతల వార్షిక సదస్సు సందర్భంగా తొలిసారి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో- ఒబామా భేటీకి గతంలో షెడ్యూల్‌ ఖరారైంది.
చైనాలోని హాంగ్‌ఝౌలో జీ20 సదస్సులో పాల్గొన్న అనంతరం ఒబామా తన గురించి రోడ్రిగో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యల గురించి తెలియగానే తన భేటీని రద్దు చేసుకున్నట్టు తెలిపారు.

Barack Obama

ఫిలిప్పీన్స్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతోపాటు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రోడ్రిగో ప్రపంచ మీడియా దృష్టిలో పడ్డారు. కాగా, వైట్‌హౌస్‌ సిబ్బంది ద్వారా రోడ్రిగో వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఒబామా.. ఆయనతో సమావేశం వృథా ప్రయాసే అనే నిర్ణయానికి వచ్చారు. తాము ఎవరితోనైనా చర్చలు జరిపితే.. అవి నిర్మాణాత్మకంగా, ప్రతిఫలం ఇచ్చేవిగా ఉండాలని కోరుకుంటున్నామని ఒబామా చెప్పారు.

కాగా, వియత్నాం రాజధాని లావోస్‌కు వచ్చిన ఒబామా దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్‌ జియున్‌-హైతో భేటీ అయ్యే అవకాశముంది. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలపై వీరు ప్రధానంగా చర్చించవచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి ఒకరు వియత్నానికి రావడం ఇదే తొలిసారి.

తీరిగ్గా పశ్చాత్తాపం

రోడ్రిగో వ్యాఖ్యలపై ఫిలిప్పీన్స్‌ అధికారులతో మాట్లాడి, నిజం తెలుసుకోవాలని తన సన్నిహిత అధికారులకు తెలిపినట్లు ఒబామా చెప్పారు. అయితే అనుచిత వ్యాఖ్యలపై రొడ్రిగో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు ఫిలిప్పీన్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మీడియా ప్రశ్నలతో ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశారని, అందుకు చింతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

English summary
President Barack Obama cancelled what would have been his first meeting with Filipino President Rodrigo Duterte, after Duterte described Obama in vulgar terms+ , a White House spokesman said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X