ట్రంప్ కు తాలిబన్ల పిలుపు
వాషింగ్టన్ :అమెరికా అద్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంపుకు తాలిబన్లు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్వవహారించాలని కోరారు తాలిబన్లు. ఆఫ్ఘన్ నుండి వెంటను అమెరికా సైనికబలగాలను ఉపసంహరించుకోవాలని తాలిబన్లు డిమాండ్ చేశారు.మరో వైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి ట్రంప్ ను అభినందించాడు.
ఇతర దేశాల స్వాతంత్ర్యం ,సార్వభౌమాధికారాన్ని హారించరాదన్న విధానాన్ని అమెరికన్లు రూపొందించుకోవాలని తాలిబన్లు డిమాండ్ చేశారు.ఈ మేరకు తాలిబన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.ఇస్లామిక్ టెర్రరిజం పట్ల ఆది నుండి ట్రంప్ కఠినంగానే ఉంటానని ప్రకటించాడు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ మేరకు ఇస్లామిక్ టెర్రరిజాన్ని అణచివేసే శక్తి తనకు ఉందని ఆయన చెప్పారు. ముస్లింలను అమెరికాలో ప్రవేశంపై ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు.

ఒబామా ఆహ్వనం
తాలిబన్ల పిలుపుతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఇబామా కూడ ట్రంప్ కు ఆహ్వానం పలికాడు. ఎన్నికల్లో విజేతగా నిలిచిన ట్రంప్ ను మర్యాదపూర్వకంగా ఒబామా ఫోన్ చేసి ఆహ్వానించాడు.గురువారం నాడు వైట్ హౌజ్ లో తనను కలవాలని ఆయన కోరాడు.45వ, అధ్యక్షుడుగా భాద్యతలు చేపట్టబోయే ట్రంప్ కు ఒబామా ఫోన్ చేశాడని వైట్ హౌజ్ అధికార ప్రతినిధి తెలిపారు.
వైట్ హౌజ్ నుండి ట్రంప్ కు పోన్ వచ్చిన విషయాన్ని ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ కెల్లియానే దృవీకరించారు. భవిష్యత్తు కార్యక్రమాలపై వీరిద్దరూ గురువారంనాడు చర్చించుకోనున్నారు.అధికార బదిలీకి సంబందించిన అంశాలపై వారు చర్చించుకొనే అవకాశం ఉంది. ఎన్నికల్లో విజయం సాధించినందుకు తొలుత ట్రంప్ ను అభినందించారు ఒబామా.
-
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications