Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధనవంతులకు బిగ్ షాకిచ్చిన సర్కార్.. ఇకపై 5 శాతం ఆదాయపు పన్ను విధింపు..

గల్ఫ్ దేశమైన ఒమన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమన్ లోని ధనవంతులకు ఇకపై 5 శాతం ఇన్ కమ్ ట్యాక్స్ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2028 జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. గల్ఫ్ దేశాల్లో ధనవంతులకు ఆదాయపు పన్ను విధించిన తొలి దేశంగా ఒమన్ నిలిచింది. అయితే ఈ ఇన్ కమ్ ట్యాక్స్ ఏడాదికి 42,000 రియాల్స్ అంటే దాదాపు ఏడాదికి ఒక లక్షా 9వేల డాలర్లు.. మన భారత కరెన్సీలో రూ.94 లక్షలు అంతకంటే ఎక్కువ సంపాదించే వారికే వర్తిస్తుంది.

ఒమన్ లోని ధనవంతులకు ఆ దేశ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఇన్ కమ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని ధనికులకు 5 శాతం ఇన్ కమ్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త రూల్ 2028 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఏడాదికి 42 వేల రియాల్స్ అంటే లక్షా 9వేల డాలర్లు.. మన భారత కరెన్సీలో రూ.94 లక్షలు.. అంతకంటే ఎక్కువ సంపాదించేవారికి ఈ రూల్ వర్తిస్తుందని ఒమర్ ప్రభుత్వం పేర్కొంది.

ఈ కొత్త విధానం ఒమన్ లోని ఒక శాతం ధనవంతులపై ప్రభావం పడొచ్చని బ్లూమ్ బర్గ్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇదే విషయంపై మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మహమ్మద్ బిన్ అల్-సాక్రీ స్పందించారు. ఒమన్ లోని ధనవంతులు ముడి చమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని.. సంక్షేమ పథకాలపై వ్యయం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(GCC)లో ఆరు దేశాలు ఉన్నాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ. ఇది 1981లో ఏర్పడింది. అయితే ఈ దేశాల్లో ప్రస్తుతం ఒమన్ మాత్రమే తొలిసారిగా ధనవంతులకు ఇన్ కమ్ ట్యాక్స్ విధించింది. ఈ క్రమంలో మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడంపై దృష్టి సారించాయి.

Oman Pioneers Gulf s First Income Tax 5 Levy on Wealthy from 2028

ఓఈసీ డేటా ప్రకారం ఒమర్ ముడి చమురు ఎగుమతుల్లో అగ్రభాగాన ఉంది. 2023 లో 29.3 బిలియన్ డాలర్ల ముడి చమురును ఎగుమతి చేసింది. అధికభాగం చైనాకు ఎగుమతి చేస్తోంది. ప్రపంచం మొత్తంలో 15వ అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారుగా ఒమన్ ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+