వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఓ మై గాడ్, ఇది తప్పు': డొనాల్డ్ ట్రంప్ లేఖలో తప్పులు, సరిదిద్దిన మాజీ టీచర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రాసిన లేఖలో తప్పులు దొర్లాయి. లేఖలోని తప్పులను ఓ మాజీ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సరిచేశారు. అనంతరం దానిని శ్వేత సౌధంకు పంపించారు. ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

డొనాల్డ్ ట్రంప్‌ పేరుపై వైట్ హౌస్ నుంచి వచ్చిన లేఖలో తప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఆ లేఖను వెనక్కి పంపించారు సదరు మాజీ టీచర్. ఆ లేఖలో ఎక్కడెక్కడ గ్రామర్‌ తప్పులు ఉన్నాయనే దానిని గుర్తిస్తూ వాటిని ఎలా రాయాలనేది కూడా ఆమె అందులో సూచించారు. కొన్ని చోట్ల ఓ మై గాడ్ ఇది తప్పు అని పేర్కొన్నారు.

OMG this is WRONG: Retired teacher corrects letter signed by Trump

ఫిబ్రవరి నెలలో ఫ్లోరిడాలోని ఓ స్కూల్లో ఓ యువకుడు మారణహోమం సృష్టించి 17 మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన బాధితులను కలవాల్సిందిగా కోరుతూ 61 ఏళ్ల యొన్నె మసన్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ఆమె రాసిన లేఖకు ట్రంప్‌ పేరిట వైట్ హౌస్ నుంచి ప్రత్యుత్తరం వచ్చింది.

ఆ లేఖపై ట్రంప్‌ సంతకం ఉంది. కానీ ఆ లేఖలో వాక్య నిర్మాణంలో చాలా తప్పులు ఉన్నాయట. అనవసర పదాలను ఉపయోగించారట. వీటన్నింటినీ ఆమె సరిచేసి ఆ లేఖను మళ్లీ తిరిగి ట్రంప్‌కు పంపించారు. ఈ విషయాన్ని మసన్‌ తెలియజేస్తూ లేఖను ఫేస్‌బుక్‌ ద్వారా పోస్టు చేశారు. ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె 2017లో పదవీ విరమణ పొందారు.

English summary
The notes were sprawled across a letter bearing President Donald Trump's signature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X