Omicron పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: ఊపిరితిత్తుల వరకు ఎందుకు చొచ్చుకెళ్లదు..సైంటిస్టులు మాటేంటి..?

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను సైతం ఒమిక్రాన్ వణికిస్తోంది. అయితే ఒమిక్రాన్ పై రోజుకో వార్త పుట్టుకొస్తుండటంతో ప్రజల్లో గందరగోళం ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఒకరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకరకమైన ప్రకటన చేస్తే.. శాస్త్రవేత్తలు ఇందుకు భిన్నంగా మరో ప్రకటన చేయడంతో ఒమిక్రాన్ పై అటు ఆందోళన ఇటు భయం రెండూ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు.

Recommended Video

    Flurona: COVID And Flu Mix Double Infection కోవిడ్ - ఫ్లూ నుండి ఫ్లూరోనా | Oneindia Telugu
    వేగంగా వ్యాప్తి కానీ...

    వేగంగా వ్యాప్తి కానీ...

    కరోనా మరో వేరియంట్ ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనది కాదంటూ ఆసక్తికర ప్రకటన చేశారు శాస్త్రవేత్తలు. దీని తీవ్రత ప్రాణాలు తీసేంతగా ఉండదని అయితే వేగంగా వ్యాప్తి చెంది హాస్పిటల్ పాలు చేయగలిగే సామర్థ్యం ఈ వేరియంట్‌ సొంతమని హెచ్చరించారు. ఇక ఎలుకల్లో ఈ వేరియంట్‌ను ప్రయోగించినప్పుడు ఇది పెద్ద ప్రమాదకరం కాదని ఆ ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఒమిక్రాన్‌ పలు రకాల మ్యూటెంట్స్ కలిగి ఉన్నదని తెలుసు. దీంతోనే వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతోంది. డెల్టా కంటే 70 రెట్లు ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని హాంకాంగ్ యూనివర్శిటీలోని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఇక డెల్టా వేరియంట్, కరోనావేరియంట్‌లతో పోలిస్తే ఇది ఊపిరితిత్తుల వరకు చేరుకోవడంలో ఈ రెండిటికంటే వేగంగా జరుగుతోందని అయితే ఊపిరితిత్తుల లోపలికి చొచ్చుకెళ్లడంలో విఫలమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీని తీవ్రత తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

     రోగనిరోధక శక్తిపై...

    రోగనిరోధక శక్తిపై...

    వైరస్ ఒక్కసారిగా నోటి నుంచి లేదా ముక్కు నుంచి శరీరంలోకి వెళ్లినప్పుడు మిగతా శరీరమంతా పాకుతుంది. అదే శరీరంలోపలికి వెళ్లకుండా దాన్ని ముందుగానే అడ్డుకుంటే తీవ్రత ఉండదని విశ్లేషించారు. అయితే ఈ వైరస్ యొక్క తీవ్రతను శరీరం ఏ మేరకు తట్టుకోగలదనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుందని డాక్టర్ మైఖేల్ చాన్ అనే పరిశోధకుడు వెల్లడించారు. ఇక ఒమిక్రాన్ విషయానికొస్తే ఇది వేగంగా వ్యాప్తి చెంది మరణం వరకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉందని చెప్పారు. ఊపిరితిత్తులకు వ్యాధి సోకనప్పటికీ శరీరంలో రోగనిరోధక శక్తి లేకుంటే మృతి చెందే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు.

     ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లదు ఎందుకు

    ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లదు ఎందుకు


    ఇక ఊపిరితిత్తులకు ఒమిక్రాన్ హాని ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు గ్లాస్గో శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. ఊపిరితిత్తుల కణాలపై TMPRSS2 అనే ప్రొటీన్ ఉందని ఇది ఒమిక్రాన్‌ వైరస్‌ను ఊపిరితిత్తులలోపలికి చొచ్చుకెళ్లకుండా రక్షణగా ఉంటోందని చెప్పారు. అయితే నోరు. ముక్కు, గొంతు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ ఊపిరితిత్తుల వరకు చేరడం లేదని చెబుతున్నారు. ఇక వైరస్ నోటిలో , ముక్కులో గొంతులో ఉండగా దగ్గడం ద్వారా లేదా తుమ్మడం ద్వారా మరో వ్యక్తికి సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

     ఎలుకలపై పరిశోధనలు...

    ఎలుకలపై పరిశోధనలు...

    ఇక అమెరికా జపాన్ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఎలుకల్లో ఉండే ACE2 రిసెప్టర్లే మనిషిలోనూ ఉంటాయి. ఒమిక్రాన్‌ సోకిన ఎలుకల్లో వాటి ఊపిరితిత్తులు చాలా తక్కువ స్థాయిలో నష్టం జరిగినట్లు కనుగొన్నారు. అంతేకాదు బరువు తగ్గడం కూడా చాలా తక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు పరిశీలించారు. దీంతో అవి చనిపోలేదని చెప్పారు. డెల్టా సోకినప్పుడు ఎలుకలు వెంటనే చనిపోయాయని తెలిపారు. అంటే ఒమిక్రాన్ అంత ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాదనే అండర్‌స్టాండింగ్‌కు శాస్త్రవేత్తలు వచ్చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+