డెల్టా వేరియంట్ కంటే 70 రేట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి.. హాంకాంగ్ నిపుణుల ఆధ్యయనం
ప్రపంచదేశాలను ఒమిక్రాన్ కలవరపెడుతంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పటికే 77 దేశాలకు పైగా వ్యాపించింది. డెల్టా వేరియంట్ కంఏ 70 రేట్ల వేగంతో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మాస్క్ తప్పని చేశాయి. అటు బూస్టర్ డోస్‌ను తమ పౌరులకు అందిస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్‌కు సంబంధించిన షాకింగ్ విషయాలను హాంకాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.

70 రేట్లు వేగంతో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి
కరోనా-19 అసలైన వైరస్, డెల్టా వేరియంట్ కంటే 70 రేట్లు వేగంతో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిస్తోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. గత వేరియంట్‌లకు భిన్నంగా ఇది మానవ శరీరంపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. అయితే తీవ్రమైన అనారోగ్యం బారినపడే ప్రమాదం తక్కువని వారి పరిశోధనలు తెలినట్లు తెలిపారు. ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపే దిగువ శ్వాసకోశంలోకి వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఊపిరితిత్తులపై ప్రభావం ..
ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తికి 24 గంటల తర్వాత సార్స్ కోవ్-2, డెల్టా వైరస్‌ల కంటే 70 రేట్ల వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభమవుతోందని పరిశోధకులు వెల్లడించారు. అయితే కరోనా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ ఊపిరితిత్తులపై ప్రభావం తక్కువగా ఉన్నట్లు తమ మరో అధ్యయనంలో తేలినట్లు పేర్కొన్నారు. అందుకే తీవ్రత ఎందుకు తక్కువగా ఉంటుందో తెలుసుకునేందుకు ఎక్స్-వీవో కల్చర్‌పై హాంకాంగ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే వైరస్ గుర్తించినప్పటికీ ఇది మరీ ఎక్కువగా ప్రమాదకమైనది కాదని తెలిపారు.

ఒమిక్రాన్ నియంత్రణపై దృష్టి
ఇది మానవ కణజాలాలపై తీవ్ర ప్రభావితం చేస్తున్నప్పటికీ వ్యాధి అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఒమిక్రాన్ మహమ్మారి ప్రభావం మనిషి శరీరంలోని రోగ నిరోధకశక్తిపై కూడా ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ మైఖేల్ ఛాన్ వెల్లడించారు. ప్రస్తుతం దాని తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ, దాని వ్యాప్తి పెరుగుదల తీవ్రమైన సమస్యలను కలిగిస్తోందన్నారు. ఒమిక్రాన్ నియంత్రణపై ప్రపంచదేశాలు దృష్టి పెట్టాల్సిఉందన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదమే..
ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై నిర్లక్ష్యం పెనుప్రమాదం పొంచి ఉందని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. గత వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ తొందరగా వ్యాప్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక దూరం పాటించడంతో పాటు, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించింది.












Click it and Unblock the Notifications