ఒక్క ఫోన్ కాల్.. ఆగిపోయిన డీల్! మోదీపై అమెరికా మంత్రి షాకింగ్ కామెంట్స్
అమెరికా, భారత్ మధ్య జరగాల్సిన భారీ వాణిజ్య ఒప్పందం ఎందుకు నిలిచిపోయిందనే అంశంపై అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లూట్నిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లూట్నిక్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ సకాలంలో పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేయకపోవడమేనని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా డీల్స్‌ను క్లోజ్ చేసే నాయకుడని, ఎదుటి పక్షం నేత నేరుగా సంప్రదించినప్పుడే ఆయన ఒప్పందాలను ఖరారు చేస్తారని లూట్నిక్ వివరించారు. భారత్‌తో ఒప్పందం మొదట జరుగుతుందని తాము భావించామని, కానీ మోదీ నుంచి కాల్ రాకపోవడంతో ఆ సమయాన్ని ఇతర దేశాలతో ఒప్పందాల కోసం కేటాయించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
ట్రైన్ స్టేషన్ దాటిపోయింది..
భారత పక్షం నేరుగా మాట్లాడటానికి కొంత అసౌకర్యంగా భావించిందని.. ఆ లోపు అమెరికా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలతో వేగంగా చర్చలు జరిపి షరతులను ఖరారు చేసుకుందని టూట్నిక్ వెల్లడించారు. సుమారు 3 వారాల తర్వాత భారత్ మళ్లీ చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ.. అప్పటికే పరిస్థితులు మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. "అప్పటికే రైలు స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది" అని చెబుతూ, ఇతర దేశాలతో అప్పటికే ఖరారైన షరతులను మార్చడానికి భారత్ ప్రయత్నించడం సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు.

భారత్ ఎగుమతులపై ప్రభావం
ప్రస్తుతం అమెరికాకు భారత్ నుంచి జరిగే ఎగుమతులపై దాదాపు 50 శాతం వరకు టారిఫ్ (సుంకాలు) అమలవుతున్నాయి. ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ సకాలంలో జరిగి ఉంటే, భారతీయ ఎగుమతిదారులకు భారీ ఊరట లభించేది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఈ ఒప్పందం కుదరకపోవడం భారత వాణిజ్య రంగానికి కొంత ప్రతికూలంగా మారింది.
🚨 India’s trade deal wasn’t finalized because PM Narendra Modi did not call Donald Trump, claims US Commerce Secretary Howard Lutnick.
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 9, 2026
“I set the deal up, but Modi didn’t call—India was uncomfortable,” Lutnick said.
👉 One more proof that India did not BOW DOWN 🔥 pic.twitter.com/xmCvsKKmTd
అసలు ఇబ్బందులు ఎక్కడ?
అమెరికా వాదన ప్రకారం.. భారత్ తన మార్కెట్లను అమెరికా ఉత్పత్తుల కోసం పూర్తిగా తెరవడం లేదని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు భారత్ తన రైతుల, స్థానిక వ్యాపారుల ప్రయోజనాలను పక్కనబెట్టి ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఈ 'ఈగో', 'పాలసీ' వార్ కారణంగానే వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ వాణిజ్య పరంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!! -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బీహార్ నూతన సీఎం గా అనూహ్య ఎంపిక, నితీశ్ 'ఫిక్స్' - మోదీ మార్క్ నిర్ణయాలు..!!












Click it and Unblock the Notifications