అమెరికాలో 1000కు పైగా విమానాలు రద్దు.. ఏం జరుగుతోంది..?
అమెరికాలో 1000కు పైగా విమానాలు రద్దు అయ్యాయి. సాంకేతికత లోపం కారణంగా అమెరికాలోని ప్రముఖ విమానాశ్రయాల్లోని విమానాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆగస్టు 6, 7 తేదీల్లో విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. చికాగో కు వెళ్లాల్సిన విమానాలు రద్దయినట్లు పేర్కొంది. అలాగే డెన్వర్, నేవార్క్, హౌస్టన్, శాన్ ఫ్రాన్సిస్కోలోని విమానాశ్రయాల్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. ఈ సమస్యను ఆగస్టు 6 రాత్రి నాటికి పరిష్కరించినా.. ఆగస్టు 7 న కూడా పలు విమానాలు ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించినట్లు సమాచారం.
ఇదే విషయంపై చికాగో లోని ఎయిర్ లైన్స్ స్పందిస్తూ.. సేఫ్టీ తమ ప్రథమ కర్తవ్యం అని.. ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా తమ సందేశాన్ని పంపింది. అయితే అమెరికాలోని 35 శాతం ఎయిర్ లైన్స్ విమానాలు ఆలస్యంగా ప్రయాణించాయని.. మరో 6 శాతం విమానాలు మొత్తానికే రద్దు అయినట్లు ఫ్లైట్ అవేర్ అనే సంస్థ పేర్కొంది. విమానాలు రద్దు, ఆలస్యం కావడంపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు యూనైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ ఈ సమస్యపై స్పందించి.. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. దయచేసి ఓపికతో సహకరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ పై అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. అంతేకాక త్వరలో భారత్ పై సెకండరీ శాంక్షన్స్ విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇక ఉక్రెయిన్- రష్యా మధ్య మూడేళ్లకు పైగా జరుగుతున్న నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలంటే భారత్ ను నిలువరించాలని ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి భారత్ చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్న క్రమంలో భారత్ పై ట్రంప్ తాజాగా 50 శాతం టారిఫ్ లు విధించారు.












Click it and Unblock the Notifications