అమెరికాలో పని చేసే భారతీయులకు భారీ షాక్
భారతీయులకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్షల్లో విఫలమైన 7,000 మందికి పైగా అమెరికా ట్రక్కు డ్రైవర్లను విధుల నుంచి తొలగించింది. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. వారంతా కూడా పంజాబ్, హర్యానాకు చెందిన వాళ్లు. ఈ విషయాన్ని రవాణా మంత్రిత్వ శాఖ అధికారి సీన్ డఫీ తెలిపారు. అమెరికా ట్రక్ ఇండస్ట్రీలో సుమారు 1,50,000 మంది సిక్కులు పని చేస్తున్నారు. వారి ఉద్యోగాలు ఇక ప్రమాదంలో పడినట్టయింది.
అమెరికా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం- కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారందరూ స్థానికులతో మాట్లాడటానికి, రోడ్లపై అమర్చిన సైన్ బోర్డులను అర్థం చేసుకోవడానికి, అధికారులతో కమ్యూనికేట్ చేయడానికి ఆంగ్లంలో చదవడం, మాట్లాడటం తప్పనిసరి. దీనికోసం కొత్తగా ఇంగ్లీష్ భాషపై టెస్టులను నిర్వహిస్తోంది. తాజాగా ఇందులో విఫలమైన వారిని ఉద్యోగాల నుంచి అప్పటికప్పుడు తొలగించింది.

ఈ నిర్ణయం- అమెరికాలోని భారతీయ, భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా ట్రక్ ఇండస్ట్రీలో లక్షలాది మంది సిక్కులు వివిధ హోదాల్లో పనిచేస్తుండగా.. వారిలో 90 శాతం మంది డ్రైవర్లే. తాజాగా 7,248 మంది డ్రైవర్లను విధుల నుంచి తొలగించినట్లు సీన్ డఫీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (FMCSA) నుండి వచ్చిన రియల్ టైమ్ డేటా గురించి వివరించారు.
జులైలో 1,500 మంది డ్రైవర్లు మాత్రమే విధుల నుంచి తొలగింపునకు గురయ్యారు. తాజాగా ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆంగ్ల భాషా పరీక్షల్లో విఫలమైన డ్రైవర్లను తొలగించేలా డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుండి ఇది అమలులోకి వచ్చింది. అమెరికాలో జరిగిన అధిక శాతం రోడ్డు ప్రమాదాల్లో భారతీయ ట్రక్ డ్రైవర్ల ప్రమేయం ఉండటం దీనికి కారణమైంది. కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో చోటు చేసుకున్న ప్రమాదాలను దీనికి కారణంగా చూపుతోంది.
ఈ రెండు రోడ్డు ప్రమాదాల్లో కూడా ముగ్గురు చొప్పున అమెరికన్లు దుర్మరణం పాలయ్యారు. ఫ్లోరిడా ప్రమాదానికి కారకుడైన ట్రక్ డ్రైవర్ కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో పదేపదే విఫలమయ్యాడని గతంలో ఏబీసీ న్యూస్ వెల్లడించింది. అయినప్పటికీ అతను కాలిఫోర్నియా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ను సాధించగలిగాడని పేర్కొంది.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications