హెచ్ఐవీ వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్.. ఎక్కడ అంటే..
కొత్త హెచ్ఐవీ వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఆక్స్ ఫర్డ్ వర్శిటీకి చెందిన సైంటిస్టులు ప్రారంభించారు. HIVconsvX టీకా భద్రత, రోగనిరోధక శక్తిని అంచనా వేయడమే లక్ష్యంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. హెచ్ఐవీ-1 వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని మొజాయిక్ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. 18-65 ఏళ్ల వయస్సు గల 13 మంది హెచ్ఐవీ నెగటివ్ కలిగిన వ్యాధి ప్రమాదం లేనివారిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
తొలుత వ్యాక్సిన్ ఒక మోతాదును అందుకోనున్నారు. తర్వాత నాలుగు వారాలకు మరో బూస్టర్ మోతాదు ఇస్తారు. హెచ్‌ఐవి వ్యాక్సిన్ సమర్థత 40 ఏళ్లు అస్పష్టంగా ఉంది. హెచ్ఐవి-నెగటివ్ వ్యక్తులలో హెచ్ఐవితో సోకకుండా నిరోధించడమే ఈ కొత్త టీకా వ్యూహంగా ట్రయల్ నిర్వహిస్తున్నారని. ప్రధాన పరిశోధకుడు తోమాస్ హాంకే తెలిపారు.

చాలా మంది హెచ్ఐవి వ్యాక్సిన్ అభ్యర్థుల్లో బీ-కణాల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీలను ప్రేరేపించినట్టు గుర్తించారు. HIVconsvX రోగనిరోధక వ్యవస్థ శక్తివంతమైన, వ్యాధికారక నిర్మూలన టి కణాలను ప్రేరేపిస్తుంది. హెచ్ఐవీ నుంచి రక్షణ పొందడంతోపాటు రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీల టి సెల్ రెండింటి రక్షణ సామర్థ్యాన్ని వినియోగించుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
హెచ్ఐవీ సోకకుండా ఉండేందుకు కండోమ్ వాడకం, యాంటీ-రెట్రోవైరల్ ఔషధాలపై దృష్టిసారిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 2022 నాటికి ఈ ట్రయల్ ఫలితాలను నివేదించాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరప్, ఆఫ్రికా, అమెరికాలో కూడా హెచ్ఐవీ వ్యాక్సిన్ పై ట్రయల్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications