పార్లమెంట్‌లో దొంగలున్నారు!.. ఈ వీడియో చూడాల్సిందే!!
పాకిస్తాన్ ఎంపీల నిజాయితీని పరీక్షించడానికి నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ఓ ఉపాయాన్ని ప్రయోగించారు. ఆయన చేతిలో కొన్ని రూపాయలు పట్టుకుని ఎంపీలను అడగగా.. దాదాపు 12-13 మంది తమవని చెబుతూ చేతులెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విచిత్రమైన సంఘటన సోమవారం పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో జరిగింది.
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్‌కు సోమవారం నాడు సభలో 5 వేల రూపాయల విలువైన 10 నోట్లు దొరికాయి. ఈ క్రమంలో ఆయన వాటి గాలిలో ఊపుతూ.. ఈ డబ్బు దొరికింది.. ఎవరైనా పోగొట్టుకున్నారా అంటూ సభ్యులను అడిగారు. స్పీకర్ ఇలా అన్నారు.. "ఈ డబ్బు ఎవరిది? ఎవరివో పడిపోయి ఉండవచ్చు. ఎవరిదైనా సరే, దయచేసి చేయి ఎత్తండి." అని అన్నారు. ఈ క్రమంలో ఒకటి, రెండు కాదు ఏకంగా 12 మంది సభ్యులు చేతులెత్తారు. దీనిని చూసిన సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.

స్పీకర్ చేసిన ఫన్నీ ట్రిక్
దీనిపై స్పీకర్ హాస్యాస్పదంగా మాట్లాడుతూ.. "10 నోట్లు ఉంటే 12 మంది యజమానులు ఉన్నారు. నెమ్మదిగా సభలో అందరూ చేతులెత్తేశారు. సరే, ఎవరైతే నాకు ఇచ్చి వెళ్లారో..." అని అన్నారు. దీంతో సభలో నవ్వుల వాతావరణం నెలకొంది. సభా కార్యకలాపాల మధ్య కొద్దిసేపు సరదా విరామం దొరికింది. ప్రతిపక్ష సభ్యులు సభలోకి ప్రవేశించడానికి ముందు దొరికిన ఈ నగదు కాసేపు అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత ఆ నోట్లు పీటీఐ ఎంపీ ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదికి చెందినవని నిర్ధారించబడింది. ఆయన వాటిని తిరిగి తీసుకున్నారు. ఈ సరదా సన్నివేశం కొద్ది నిమిషాల పాటు చట్టసభ అజెండా నుంచి దృష్టిని మళ్లించింది. ఎంపీలు కూడా ఈ హాస్యాన్ని ఆస్వాదిస్తూ స్పీకర్‌ను చూసి నవ్వుకున్నారు.
🇵🇰 पाकिस्तान के Assembly में अध्यक्ष ने कुछ पैसा दिखाकर कहा कि "ये किसी के पैसे गिर गए है, जिनका है हाथ खड़ा करे"।
— Einstein Yadav (@GYdv28) December 9, 2025
अब जितने पैसे नहीं थे उतने से अधिक सांसदों ने पैसे लेने के लिए अपना हाथ खड़ा कर दिया।😂🤣🤣 pic.twitter.com/fDeJ2xm4Qa
సోషల్ మీడియాలో వైరల్
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. @GYdv28 అనే హ్యాండిల్ ద్వారా ఈ వీడియోను X (ట్విట్టర్)లో షేర్ చేశారు. ఈ వీడియోకు జత చేసిన క్యాప్షన్‌లో ఇలా ఉంది: "పాకిస్తాన్ అసెంబ్లీలో స్పీకర్ కొంత డబ్బు చూపించి, ఇవి ఎవరివో పడిపోయాయని, ఎవరిదైతే వారు చేయి ఎత్తాలని అడిగారు. అయితే, అక్కడ ఉన్న నోట్ల కంటే ఎక్కువ మంది ఎంపీలు డబ్బు తీసుకోవడానికి తమ చేతులెత్తారు." అని క్యాప్షన్ రాసి ఉంది.












Click it and Unblock the Notifications