వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోటారు‌బైక్ బాంబు పేలుడు: ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

క్వెట్టా: పాకిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్‌లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటన పాకిస్థాన్ నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం చోటు చేసుకుంది.

ఆఫ్ఘనిస్తాన్‌కు సరిహద్దుగా ఉన్న చమన్ పట్టణంలో పేలుడు సంభవించినట్లు సీనియర్ పోలీసు అధికారి రజాక్ చీమా తెలిపారు. దేశంలోని మాదక ద్రవ్యాల నిరోధక దళాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.

 Pakistan: 6 Killed, 10 Injured In Blast

అయితే, ఈ పేలుడుకు పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. కాగా, ఈ పేలుడుతో పక్కనే ఉన్న ఓ మెకానిక్ షాప్ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు తర్వాత పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ పేలుడు ఘటనపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పేలుడు ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాలపాలైనవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల్లో భయాన్ని పెంచడానికే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఇంటిరీయర్ మినిస్టర్ ఇజాజ్ షా వ్యాఖ్యానించారు. కాగా, బలూచ్ వేర్పాటువాదులు దీర్ఘకాలికంగా పాక్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్పాటువాదులు ఏమైనా దాడులకు పాల్పడ్డారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

బలూచిస్థాన్‌లో ఖనిజ సంపదకు లోటు లేకున్నా తమకు ఎలాంటి వాటా రావడం లేదని ఇక్కడ ప్రాంత ప్రజలు, నాయకుల్లో ఉంది. పాకిస్థాన్ ప్రజలతో సమానమైన హక్కులు తమకు లేవనే భావన సుమారు ఏడు మిలియన్ల బలూచ్ ప్రజల్లో ఉంది.
కాగా, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను ఈ ప్రాంతం ఉండా పోతున్న నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా బలగాలు ఎప్పుడూ పహారా కాస్తూనే ఉంటాయి.

English summary
An improvised bomb planted on a motorbike killed six people in Pakistan's restive southwestern Balochistan province on Monday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X