వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకూ వైమానిక దాడులకు పాల్పడిన అమెరికా.. ఇప్పుడు భూతల దాడులకు యత్నిస్తోంది. ఈమేరకు అదనపు బలగాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్- అమెరికా మధ్య సంధి చర్చలను జరిపేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదే విషయంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న నెల రోజుల యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందని అన్నారు. ఇరు దేశాల మధ్య సంధి చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని తెలిపారు.

మరోవైపు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా దళాలు తమపై భూతల దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి అడుగు పెడితే వారిని అగ్నికి ఆహుతి చేస్తామంటూ హెచ్చరించారు. అలాగే తమ దేశంపై దాడులు కొనసాగితే అమెరికా, ఇజ్రాయెల్ సైనికాధికారులు, రాజకీయ నేతల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇరాన్‌ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇరాన్ తమకు గౌరవ సూచకంగా 20 భారీ చమురు ట్యాంకర్లను హార్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతించిందని ట్రంప్ వెల్లడించారు. ఈ నౌకలు పాకిస్థాన్ జెండాతో ప్రయాణిస్తున్నాయని తెలిపారు.

Pakistan Announces Readiness to End Iran US Conflict Through Dialogue Pakistan ready end Iran war

గతంలో 10 నౌకలకు అనుమతి ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 20 కు పెంచినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఇరాన్- అమెరికా మధ్య చర్చల నేపథ్యంలో ఇరాన్ కు చెందిన ఖార్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకోవడంపై ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాక ఇరాన్‌ వద్ద ఉన్న దాదాపు 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల వరకు యురేనియం ను స్వాధీనం చేసుకోవడంపైనా అగ్రరాజ్యం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు తయారు చేసుకోగలిగేంత యురేనియం అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+