Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్

బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాగా రోజురోజుకూ కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. విడుదలైన 10 రోజుల్లోనే ఈ మూవీ రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే ప్రభాస్ 'కల్కి 2898 AD' (రూ.1,042 కోట్లు), యశ్ 'కేజీఎఫ్ 2' (రూ.1,215 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను తుడిచిపెట్టేసింది.

ఇక 'ధురంధర్‌-2' కేవలం భారత్ లోనే కాదు.. ఓవర్సీస్‌ లో కూడా వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఉత్తర అమెరికాలో ఈ మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈమేరకు 9 ఏళ్లుగా ఉన్న బాహుబలి 2 రికార్డును ధురంధర్‌ 2 మూవీ బద్దలుకొట్టింది. బాహుబలి 2 మూవీ నార్త్‌ అమెరికాలో అప్పట్లో 20 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా ధురంధర్‌-2 విడుదలైన పది రోజుల్లోనే ఈ రికార్డును బ్రేక్‌ చేయడం విశేషం.

Pakistan Asks for 500 Crore or 80 of Dhurandhar 2 Box Office Collections Dhurandhar 2 Pakistan

ఇదిలాఉంటే భారత్ సినిమాలపై పాకిస్థాన్ ప్రజల రియాక్షన్ ఎప్పుడూ ఫన్నీగా ఉంటాయి. అవి ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం భారత్ లో ధురంధర్ 2 మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ దేశభక్తి నేపథ్యంలో సాగుతుంది. అయితే ధురంధర్ 2 కలెక్షన్స్ లో మాకు రూ.500 కోట్లు ఇవ్వండి అంటూ పాకిస్థాన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదా ఫుల్ కలెక్షన్స్ లో దాదాపు 70 నుంచి 80 శాతం తమకు ఇవ్వాలని ఈ మూవీ డైరెక్టర్, నిర్మాత ఆదిత్య ధర్ ను పాకిస్థాన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు పాకిస్థాన్ లోని లయరీ ప్రాంత ప్రజలు ఈ డిమాండ్ చేస్తున్నారు. ధురంధర్ 2 మూవీ లయరీ ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఈ డిమాండ్ చేస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి అద్ధం పట్టేలా చిత్రాన్ని తీశారని.. అందువల్ల ఈ ప్రాంత అభివృద్ధి కోసం ధురంధర్-2 సినిమా కలెక్షన్స్ ను ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+