తాలిబన్లను ఆదుకోండి-లేకపోతే ఆప్ఘన్ ఉగ్రవాదుల అడ్డా కావడం ఖాయం-ఐరాసలో ఇమ్రాన్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ లో మారిన పరిస్ధితుల నేపథ్యంలో అధికారాన్ని చేపట్టిన తాలిబన్లకు పొరుగున ఉన్న పాకిస్తాన్ మరోసారి అండగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రసంగం చేశారు. ఇందులో తాలిబన్ల ప్రభుత్వానికి అండగా నిలవాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఆయన కోరారు.
ఆప్ఘనిస్తాన్ లో తాజాగా ఏర్పాటైన తాలిబన్ల సర్కార్ కు మద్దతివ్వాలని 76వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల వేదికగా ప్రపంచదేశాల్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. తాలిబన్ల ప్రభుత్వం బలోపేతం కావడానికి, స్ధిరీకరణ కోసం మద్దతివ్వాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్తాన్ పౌరుల్ని దృష్టిలో ఉంచుకుని తాలిబన్ల ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఆయన ఐరాస సాధారణ సభలో కోరారు.

ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ప్రపంచం ముందు రెండే దారులు ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇందులో ఒకటి ఆప్ఘన్ ను పట్టించుకోకుండా వదిలేయడం లేదా అక్కడి ప్రభుత్వాన్ని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం అని ఇమ్రాన్ వెల్లడించారు. తాము ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ని నిర్లక్ష్యం చేస్తే, ఐరాస అంచనాల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో సగం మంది ప్రజలు ఇప్పటికే బలహీనంగా ఉన్నారు వచ్చే ఏడాది నాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 90 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు వెళతారు. ముందు ముందు భారీ మానవతా సంక్షోభం ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ పొరుగువారికి మాత్రమే కాకుండా ప్రతిచోటా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందంటూ ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Recommended Video
అస్థిరతకు గురైన ఆప్ఘనిస్తాన్.. అస్తవ్యస్తంగా మారడం మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గంగా మారే అవకాశం ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో అమెరికా ఇది జరగకుండా చూసిందని, ఇప్పుడు ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని ఆప్ఘన్ ను ఆదుకోవాలని ఇమ్రాన్ సూచించారు. అంతర్జాతీయ సమాజం తాలిబాన్లను ప్రోత్సహించాలని, మానవ హక్కులను గౌరవించడం, కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మరియు వారి భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించకుండా నిరోధించేలా మన చర్యలుండాలని ఇమ్రాన్ ఖాన్ కోరారు. అంతర్జాతీయ సమాజం తాలిబన్లను ప్రోత్సహిస్తే, ఈ సరైన దారిలో నడవడానికి వారిని ప్రోత్సహిస్తే, అది ప్రతిఒక్కరికీ మేలు చేస్తుందని ఇమ్రాన్ తెలిపారు.












Click it and Unblock the Notifications