పాకిస్థాన్ లో సైనిక తిరుగుబాటు.. అధ్యక్షుడిగా అసిమ్ మునీర్..!
పాకిస్థాన్ లో మరో రాజకీయ సంక్షోభం రానున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దేశంలో సైనిక తిరుగుబాటు జరిపి పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని గద్దె నుంచి దించేయాలని పన్నాగం పన్నినట్లు అక్కడి సీనియర్ జర్నలిస్ట్ సయీద్ అభిప్రాయపడ్డారు. అసిమ్ మునీర్ ఈ మేరకు పథకాన్ని రచిస్తున్నట్లు తెలిపారు.
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని అధ్యక్ష పదవి నుంచి దించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్లాన్ వేస్తున్నట్లు అక్కడి జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన సైన్యంతో కలిసి ఈ మేరకు అసిమ్ మునీర్ సిద్ధం అవుతున్నట్లు పాకిస్థాన్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సయీద్ అభిప్రాయపడ్డారు. 1977లో పాకిస్థాన్ లో సైనిక తిరుగుబాటు జరిగింది.

ఆ ఏడాది జూలై 5న జరిగిన సైనిక తిరుగుబాటులో జనరల్ జియాఉల్ హక్ కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన జరిగి 47 ఏళ్లు అయింది. అయితే అప్పటిలాగే ఇప్పుడు కూడా దేశంలో అలాంటి పరిస్థితులే నెలకొన్నట్లు సీనియర్ జర్నలిస్ట్ సయీద్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
#Pakistan army chief #AsimMunir to become new president as country heads to another military coup? Reports claim...https://t.co/JxVXmflXiZ
— DNA (@dna) July 6, 2025
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి కొంత సమయం ఇచ్చి పదవికి రాజీనామా చేయమని ఇబ్బంది పెట్టడం లేదా డైరెక్ట్ సైనిక తిరుగుబాటు జరిపి ఆ గద్దెను అసిమ్ మునీర్ ఆక్రమించడం ఏదో ఒకటి రానున్న కొద్దిరోజుల్లో జరిగే ప్రమాదం ఉందని సీనియర్ జర్నలిస్ట్ సయీద్ ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications