పాకిస్తాన్ రహస్యం బట్టబయలు: వెలుగులోకి సంచలన నిజాలు!
Pakistan: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని భద్రతా బలగాలు ఐఎస్ఐఎస్-కె (ISIS-K) - ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ పాకిస్తానీ ఉగ్రవాదిని అరెస్ట్ చేశాయి. సయీదుల్లాగా గుర్తించబడిన ఈ వ్యక్తిని విచారించగా.. అతను పలు ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టాడు. ఈ సందర్భంగా అతను పాకిస్తాన్ గుట్టు రట్టు చేశాడు. విచారణ సందర్భంగా సయీదుల్లా బయటపెట్టిన రహస్యం ఏమిటంటే.. పాకిస్తాన్‌లోని క్వెట్టా, పెషావర్ నగరాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని వెల్లడించాడు.
ఈ స్థావరాలలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ పొందినవారు 'జిహాద్' పేరుతో ప్రాంతీయ ఉగ్రవాదాన్ని పెంచేందుకు పనిచేస్తారని సయీదుల్లా వెల్లడించాడు. ఉగ్రవాదాన్ని పెంచడంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలో పాకిస్తాన్ పాత్ర బయటపడటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద నిజాలు బట్టబయలు అయ్యాయి.

మదరసాలలో బ్రెయిన్‌వాష్
సయీదుల్లా అందించిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్‌లో అనేక మదరసాలలో చిన్న వయస్సు నుంచే పిల్లలకు ఇస్లాం పేరుతో బ్రెయిన్‌వాష్ చేస్తారు. తాను కూడా పెషావర్‌లోని లష్కర్-ఎ-తైబా (Lashkar-e-Taiba)తో అనుబంధం ఉన్న ఒక మదరసాలో చదువుకున్నానని సయీదుల్లా చెప్పాడు. అక్కడే అతనికి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద భావజాలంతో పరిచయం ఏర్పడింది. అతని మెదడును పూర్తిగా బ్రెయిన్‌వాష్ చేశారు. ఉగ్రవాద సంస్థలకు చెందిన మదరసాలలో చదివే ప్రతి పిల్లవాడికి ఇదే విధంగా బ్రెయిన్‌వాష్ జరుగుతుందని అతను పేర్కొన్నాడు.
శిక్షణ తర్వాత 'జిహాద్' కోసం తరలింపు
మదరసాలలో బ్రెయిన్‌వాష్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ పిల్లలకు పూర్తిస్థాయి ఉగ్రవాద శిక్షణ ఇస్తారు. శారీరకంగా, మానసికంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సిద్ధం చేస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని 'జిహాద్' లక్ష్యంతో వివిధ ప్రాంతాలకు పంపుతారు. ఈ ఉద్దేశంతోనే సయీదుల్లాను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపారు. నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి అతన్ని ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశపెట్టారు. అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ తరఫున ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు అతనికి మిషన్ అప్పగించారు. అయితే, ఈ సమయంలోనే అతను భద్రతా బలగాలకు పట్టుబడటంతో, విచారణలో పాకిస్తాన్ నిజస్వరూపం పూర్తిగా వెల్లడైంది.












Click it and Unblock the Notifications