తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతు-బానిసత్వపు సంకెళ్లు తెంచేశారంటూ ఇమ్రాన్ ప్రశంస

ఆప్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రపంచదేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. దాని పొరుగుదేశం పాకిస్తాన్ మాత్రం సంతోషంలో మునిగి తేలుతోంది. ఇప్పటివరకూ అక్కడ పాగా వేసిన పాశ్చాత దేశాల బలగాలు తప్పుకోవడంతో తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడంతో పాకిస్తాన్ తాజా పరిణామాలపై సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్ఘన్ తాజా పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ స్పందించారు.

Recommended Video

    Imran Khan Supports Taliban, Afghanistan plunges Into Chaos | Oneindia Telugu

    ఆప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంపై స్పందించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దీన్ని స్వాగతించారు. వారు బానిసత్వపు సంకెళ్లను తెంచుకున్నారంటూ తాలిబన్లను ఉద్దేశించి ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. తాలిబన్లు గతంలో మహిళలు, చిన్నారులపై చేసిన దాడుల్ని ప్రస్తావిస్తూ... ఇతర సంస్కృతుల్ని గమనిస్తే వారు ఎంత బానిసత్వంలో మగ్గుతున్నారో అర్ధమవుతుందంటూ ఇమ్రాన్ సమర్ధించుకొచ్చారు. తద్వారా ఇతర సంస్కృతుల కంటే తాలిబన్ సంసృతే మెరుగన్నట్లుగా ఆయన మాట్లాడారు.

    pakistan supports taliban takeover of afghanistan, imran terms it as breaking the chains of slavery

    ఆప్ఘనిస్తాన్ లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనాతో పాటు పాకిస్తాన్ కూడా తాలిబన్లకు మద్దతివ్వొచ్చన్న ప్రచారం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఇమ్రాన్ వ్యాఖ్యలతో ఆప్ఘన్ లో ఏర్పడే కొత్త తాలిబన్ల ప్రభుత్వానికి పాకిస్తాన్ అండ ఉంటుందని చెప్పకనే చెప్పినట్లయింది. అదే సమయంలో తాలిబన్ల విధానాల్ని కూడా సమర్ధించేలా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే భవిష్యత్తులో ఈ రెండు దేశాలు కలిసి పనిచేయడం కూడా ఖాయంగా తెలుస్తోంది.

    మరోవైపు చైనా కూడా మద్దతు సంకేతాలు ఇస్తున్న తరుణంలో తాలిబన్లకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం మద్దతే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లకు ఇమ్రాన్ ఖాన్ ప్రకటన ఊరట కానుంది. చైనా, పాకిస్తాన్ తో పాటు తమకు మద్దతిచ్చే దేశాలతో త్వరలో చర్చలు జరిపేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చిన ఖతార్ తో పాటు ఇతర ముస్లిం దేశాలు కూడా ఇదే బాటలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+