పాకిస్తాన్ లో ఉత్కంఠ-స్పీకర్ నిర్ణయంపై సుప్రీం విచారణ-తేలనున్న ఇమ్రాన్ భవితవ్యం
పాకిస్తాన్ లో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చివరి క్షణం వరకూ మౌనంగా ఉండి సిక్సర్ కొట్టిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం సక్రమమా కాదా అన్నది ఇవాళ తేలిపోనుంది. విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్ధతను ఇవాళ సుప్రీంకోర్టు తేల్చబోతోంది. తద్వారా ఇమ్రాన్ భవితవ్యం కూడా తేలనుంది.
పాకిస్థాన్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఆదివారం జాతీయ అసెంబ్లీలో తిరస్కరించారు. దీని తరువాత, ప్రధాని ఇమ్రాన్.. పార్లమెంటును రద్దు చేసి, తాజా ఎన్నికలను ప్రకటించారు. ఈ చర్యను ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ రాబోయే ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ఇంతలో, జాతీయ అసెంబ్లీ రద్దుతో, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా డి-నోటిఫై చేశారు. తాత్కాలిక ప్రధానిని నియమించే వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. మరికొద్ది రోజుల్లో దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా ఏర్పాటు కానుంది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణను పునఃప్రారంభించనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒమర్ అట్టా బిండియాల్, జస్టిస్ ఐజాజ్ ఉల్ అహ్సన్, జస్టిస్ ముహమ్మద్ అలీ మజార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిన్న విచారణ ప్రారంభించింది. ఈ విచారణ ఇవాళ కూడా కొనసాగబోతోంది. ఈ విచారణలో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ నిర్ణయంపై విచారణ జరిపే అధికారం తమకుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో డిప్యూటీ స్పీకర్, ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయాల్ని సుప్రీంకోర్టు సమర్ధించకపోతే మాత్రం వీరికి కష్టాలు తప్పేలా లేవు.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications