ఎయిర్ ఫోర్స్ లో భారత్ ను కొట్టేసిన పాకిస్థాన్..? చైనా నుంచి అత్యాధునిక ఫైటర్ జెట్స్ కొనుగోలు.. భారత్ అలెర్ట్
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతలు ప్రస్తుతం కాస్త సద్దుమణిగాయి. ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ సంధించిన డ్రోన్లు, క్షిపణులను భారత్ నేలమట్టం చేసింది. దాదాపు 600 డ్రోన్ లను భారత్ లోని ప్రతిష్టాత్మక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్-400 కూల్చి వేసింది. దీంతో వైమానిక రంగాన్ని పటిష్టపరిచేందుకు పాకిస్థాన్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
అయితే ప్రస్తుతం పాకిస్థాన్ తో పోల్చితే వైమానిక రంగంలో భారత్ దే పై చేయిగా ఉంది. ఇటీవల రఫేల్ యుద్ధ విమానాలు భారత్ అమ్ములపొదిలో చేరడంతో భారత వైమానిక రక్షణ వ్యవస్థ పటిష్టంగా మారింది. పాకిస్థాన్ కంటే మెరుగ్గా దృఢంగా మారింది. కానీ చైనా నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేయనున్న జే-35 స్టీల్త్ ఫైటర్ జెట్స్ తో ఇరు దేశాల మధ్య వైమానిక రంగంలో సమతుల్యత లభించే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అటు పాకిస్థాన్ కు.. ఇటు చైనాకు కామన్ శత్రువుగా భారత్ ఉంది. అందుకే చైనా వెనకాల ఉండి మరీ పాక్ ను ఉసిగొల్పుతోంది. ఈ క్రమంలోనే చైనాకు చెందిన అత్యాధునిక ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు జే-35 ను పాకిస్థాన్ కు అప్పగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 40 జే-35 స్టీల్త్ యుద్ధ విమానాలు కొనుగోలుకు పాక్ ఓకే చెప్పింది. వచ్చే ఏడాది ఇవి పాకిస్థాన్ రక్షణ రంగంలో చేరనున్నాయి.
ఇప్పటికే పాకిస్థాన్ వద్ద చైనాకు చెందిన అనేక యుద్ధ విమానాలు ఉన్నాయి. 20 జే-10సీ, జే-17 ఫైటర్ జెట్స్ ను చైనా నుంచి పాక్ కొనుగోలు చేసింది. అలాగే ఎఫ్ సీ-31 యుద్దవిమానాలు కుడా పాకిస్థాన్ వద్ద ఉన్నాయి. అయితే ఇవి భారత్ వద్ద ప్రస్తుతానికి లేవు. ఇక ఇండియా అలెర్ట్.. ఎందుకంటే.. భారత్ వద్ద స్టీల్త్ ఫైటర్ జెట్ లేదు.

అంతేకాక చైనా నుంచి పాక్ కొనుగోలు చేయనున్న ఆయుధాల్లో ప్రధానంగా 40 5th జనరేషన్ షెన్ యాంగ్ జే-35 ఫైటర్ జెట్స్, షాక్సీ కేజే- 500 ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్, సర్ ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టెమ్స్, హెచ్ క్యూ-19 ఎయిర్ డిఫెన్స్ సిస్టెమ్.. లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. దీంతో భారత్ అప్రమత్తం అయింది.
జే-35 ఫైటర్ జెట్స్ ను బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు. ఇవి అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications