కోహ్లీతో డేటింగ్ చేస్తానన్న పాకిస్థాన్ మోడల్ కాల్చివేత

Posted By:
Subscribe to Oneindia Telugu

ముల్తాన్: ఇంటర్నెట్ సంచలనం, పాకిస్థానీ మోడల్, నటి అయిన కండీల్ బలోచ్‌ను శనివారం ముల్తాన్‌లో కాల్చి చంపారు. పాకిస్థాన్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆమె సోదరుడే ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే కండీల్ బలోచ్ తనను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తనకు సెక్యూరిటీ పెంచాలని కోరింది.

పాకిస్థాన్ మోడల్‌తో సెల్ఫీ: పదవి పోగొట్టుకున్న మతాధికారి

ఇంతలోనే ఈ సంఘటన జరగడం దురదుష్టకరం. సోషల్ మీడియా ద్వారా అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని కండీల్ బలోచ్ సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన వీడియోలను పోస్టు చేసి అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకునేది.

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేయాలని తన మనసులోని కోరికను బహిరంగంగా వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

నీతో డేటింగ్: అనుష్కను వదిలెయ్ అంటూ కోహ్లీకి పాక్ మోడల్

దీంతో ఫేస్‌బుక్‌లో కండీల్ బలోచ్ పోస్టులు చూసిన ఆమె సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నట్లు పాకిస్థాన్ ప్రముఖ పత్రిక డాన్ పేర్కొంది. బలోచ్‌ను తుపాకీతో కాల్పి చంపిన అనంతరం అతడు అక్కడ నుంచి పారిపోయాడు. బలోచ్ సోదరుని పేరు ఫజియా అజీమ్.

రంజాన్‌ పండగ వేడుకల్లో పాల్గొనడానికి సొంతూరు ముల్తాన్‌ వచ్చిన బలోచ్‌ను ఇంట్లోనే సోదరుడు గొంతు కాల్చి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు. తాజాగా బలోచ్‌ చేసిన మ్యూజిక్‌ వీడియో 'బ్యాన్‌' గత వారమే విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్‌ అయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Internet sensation and Pakistani model Qandeel Baloch was shot dead in Multan on Saturday. Reports suggest that the actor-cum-model was shot dead by her brother.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X