Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pakistan News: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ ఇక పాత సామాన్లోడికే.. ఖర్మ వదలట్లే..

Pakistan Airlines: ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్న దాయాది దేశం పాకిస్థాన్ కష్టాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ విమానయాన సంస్థను విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని ప్రైవేటు సంస్థలకు విక్రయించటానికి నిర్ణయిస్తూ కనీస బిడ్డింగ్ ధరను 85 బిలియన్ పాకిస్థాన్ రూపాయలుగా నిర్ణయించింది.

అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కంపెనీని కొనుగోలు చేయటానికి కేవలం ఒకే ఒక్క బిడ్ దాఖలైందని తేలింది. అయితే కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు సదరు సంస్థ కేవలం 10 బిలియన్ పాకిస్థాన్ రూపాయలు ఆఫర్ చేసిందని వెల్లడైంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ విలువ కేవలం రూ.30.25 కోట్లుగా ఉండటం గమనార్హం. వాస్తవానికి పాక్ నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థను అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒప్పందంలో భాగంగా విక్రయించాలని నిర్ణయించింది. అప్పుల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల భారాన్ని తగ్గించటానికి ఐఎంఎఫ్ సూచించిన వేళ ఈ ఆఫర్ వచ్చింది.

Pakistan s efforts to privatise its national airline received a major jolt from bidders

పాకిస్థాన్ ప్రభుత్వం జూన్‌లో ఆరు గ్రూపులను ప్రీ-క్వాలిఫై చేసింది. అయితే రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ బ్లూ వరల్డ్ సిటీ మాత్రమే చివరికి బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొందని తేలింది. అయితే బ్లూ వరల్డ్ కూడా ప్రభుత్వం కనీస బిడ్డింగ్ రేటు కంటే దాదాపు 80 శాతం తక్కువ రేటును ఆఫర్ చేసింది. పాక్ ప్రభుత్వ కనీస బిడ్డింగ్ మెుత్తానికి ఆఫర్ చేయాలని చెప్పింది. దీనిపై బ్లూ వరల్డ్ సిటీ ఛైర్మన్ సాద్ నజీర్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ బిడ్‌ను అంగీకరించకూడదనుకుంటే మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ తరుణంలో విమానయానంలో నైపుణ్యం కలిగిన చైనీస్, టర్కీ పెట్టుబడిదారులను తీసుకురావాలని నజీర్ యోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థలో దాదాపు 7,100 మంది ఉద్యోగులు ఉన్నారు. 2,400 మందికి పైగా రోజువారీ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇది దాని ప్రైవేటీకరణకు ఆటంకం. పాత విమానాలతో కోట్లాది రూపాయల అప్పులతో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ నష్టాలను చూస్తోంది. దీనికి ముందు కొంతమంది పైలట్లు నకిలీ లైసెన్స్‌లను కలిగి ఉన్నారనే ఆందోళనలతో 2020 నుంచి యూరోపియన్ యూనియన్‌కు విమానాలను నడపడానికి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ నిషేధించబడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+