Israel vs Palestine : ఇజ్రాయెల్ దాడుల్ని సమర్ధించుకున్న పాలస్తీనా-దేశాల మిశ్రమ స్పందన..
ఇజ్రాయెల్ పై ఇవాళ తెల్లవారు జాము నుంచి పాలస్తీనా ప్రభుత్వంతో పాటు తీవ్రవాద సంస్ధ హమాస్ జరుపుతున్న దాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే వేల రాకెట్లతో ఇజ్రాయెల్ పై పాలస్తీనా విరుచుకుపడటంతో ఆ దేశం వెంటనే తేరుకుని కౌంటర్ దాడులకు దిగింది. దేశ ప్రజల్ని యుద్ధం నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలని కోరిన ఇజ్రాయెల్ తమకున్న అత్యాధునిక పరిజ్ఞానంతో పాలస్తీనాను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై చేస్తున్న దాడులపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఇవాళ తొలిసారి స్పందించారు.పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఇజ్రాయెల్-గాజా ఘర్షణలపై తన మొదటి ప్రకటనను విడుదల చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకునే హక్కు పాలస్తీనియన్లకు ఉందని అన్నారు. ఇజ్రాయెల్ తో పాటు అక్కడ స్థిరపడిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకునే హక్కు ఉందన్నారు.

మరోవైపు ఇజ్రాయెల్ పై పాలస్తీనా చేస్తున్న దాడులపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్ల దాడికి ఇరాన్ మద్దతు ఇస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సలహాదారు ప్రకటించారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్ల మధ్య జరుగుతున్న దాడుల్లో సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్ల దాడిని హెలెనిక్ రిపబ్లిక్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఖండించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన చర్యను "ఉగ్రవాద దాడి"గా అభివర్ణించారు.
అటు సౌదీ అరేబియా పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్‌ల మధ్య తక్షణమే ఉద్రిక్తతను తగ్గించాలని పిలుపునిచ్చింది. హమాస్ దాడిని యూరోపియన్ నేతలు ఖండించారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమీషన్ అధిపతి ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ దాడి అత్యంత నీచమైన రూపంలో ఉన్న తీవ్రవాదం అన్నారు. లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా హమాస్ ఆపరేషన్ ను అభినందించింది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ తనను, తన ప్రజలను రక్షించుకునే హక్కు ఉందని తెలిపింది.
-
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications