వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టబోయే బిడ్డకు రెస్టారెంటు పేరు: ఎందుకీ నిర్ణయం?.. ఆ దంపతులు ఏం చెబుతున్నారంటే!

ఆ దంపతుల పేర్లు జస్టిన్, జోర్డాన్ గార్టన్. ఓసారి వరుసపెట్టి ఎనిమిది వారాల పాటు ఆలివియా గార్టన్ రెస్టారెంటులో ఇటాలియన్ రుచులను ఆస్వాదించారట. అప్పటినుంచి ఈ రెస్టారెంటుతో ఏదో తెలియని అనుబంధం ఏర్పడిందని

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అరిజోనాకు చెందిన ఓ జంట తమకు పుట్టబోయే బిడ్డకు ఒక రెస్టారెంట్ పేరు పెట్టాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాము ఎంతగానే ఇష్టపడే ఆలివ్ గార్టెన్ రెస్టారెంట్ పేరునే తమ చిన్నారికి కూడా పెట్టాలని వారు భావిస్తున్నారు.

ఎందుకీ నిర్ణయం:

ఎందుకీ నిర్ణయం:

ఎందుకీ నిర్ణయం అంటే.. తరుచూ ఈ రెస్టారెంటుకి వెళ్లే సదరు దంపతులు ఇక్కడ ఎన్నో మధురానుభూతులను పొందారట. ఇప్పటివరకు ఒక జంటగా ఆ అనుభూతులను అనుభవించామని, ఇకనుంచి తమ కుమార్తెతో కలిసి మరిన్ని మధురానుభూతులను పొందుతామని వారు చెబుతున్నారు.

ఏదో తెలియని అనుబంధం

ఏదో తెలియని అనుబంధం

ఆ దంపతుల పేర్లు జస్టిన్, జోర్డాన్ గార్టన్. ఓసారి వరుసపెట్టి ఎనిమిది వారాల పాటు ఆలివియా గార్టన్ రెస్టారెంటులో ఇటాలియన్ రుచులను ఆస్వాదించారట. అప్పటినుంచి ఈ రెస్టారెంటుతో ఏదో తెలియని అనుబంధం ఏర్పడిందని వారు చెబుతున్నారు. ఆ అనుబంధాన్ని ఎల్లప్పుడూ గుర్తుచేసుకునేందుకే తమకు పుట్టబోయే బేబీకి రెస్టారెంటు పేరు పెట్టాలనుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు.

ట్విట్టర్ ద్వారా వెల్లడి:

ట్విట్టర్ ద్వారా వెల్లడి:

తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా జస్టిన్, జోర్డాన్ దంపతులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆలివియా అన్న పేరు నోరు తిరగడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి మధ్యలో మిచెల్లి అనే పేరు కూడా కలిపారు. అలా ఆలివియా మిచెల్లి గార్టన్(ఆలివ్ గార్డెన్ పేరు తలపించేలా) అనే పేరును ఆ చిన్నారికి పెట్టబోతున్నారు.

రెస్టారెంట్ స్టాఫ్ కూడా:

రెస్టారెంట్ స్టాఫ్ కూడా:

వరుసగా ఏడెనిమిది వారాలు ఈ రెస్టారెంటుకు రావడం ద్వారా ఇక్కడి స్టాఫ్, చెఫ్స్ అంతా తమకు స్నేహితుల్లా మారిపోయారని, ఇక్కడ తినడం ద్వారా చాలావరకు డబ్బు కూడా ఆదా చేసుకున్నామని వారు చెబుతున్నారు. ఇప్పుడు వీరికి పుట్టబోయే బిడ్డ కోసం ఆలివియా రెస్టారెంట్ స్టాఫ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
An Arizona couple claim they are planning to name their daughter Olivia Gartan after their all time favorite eatery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X