పెగాసస్ స్పైవేర్: ప్రపంచాన్ని వణికించిన వైరస్.. ఒక్క క్లిక్కుతో ఫోన్‌ డేటా హుష్ కాకి..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయాదేశ ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు లాయర్లతో పాటు ఇతర ప్రొఫెషన్స్‌లో ఉన్నవారి ఫోన్లు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు హ్యాక్ చేసేందుకు ఇజ్రాయిల్ దేశంలోని ఎన్ఎస్ఓ సంస్థ పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించినట్లు వాట్సాప్ యాజమాన్యం నిర్థారించింది. వాట్సాప్ మెసేజ్‌లపై దాడి చేసి సమాచారం హ్యాక్ చేసిందని చెబుతూ కోర్టులో ఎన్‌ఎస్ఓ సంస్థపై ఫిర్యాదు చేసింది వాట్సాప్ యాజమాన్యం. అంతేకాదు భారత్‌లో పలువురి ఫోన్లు కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వాట్సాప్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

భారతీయులు లక్ష్యంగా పెగాసస్ స్పైవేర్

భారతీయులు లక్ష్యంగా పెగాసస్ స్పైవేర్

పెగాసస్ స్పైవేర్ వినియోగించి ఎంతమంది భారతీయుల వ్యక్తిగత సమాచారం రాబట్టిందో అనేది కచ్చితంగా చెప్పలేమని వాట్సాప్ యాజమాన్యం వెల్లడించింది. మేలో జరిగిన సైబర్ అటాక్‌లో కొందరు ముఖ్యులైన భారతీయులు ఉండే ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు వాట్సాప్ ప్రతినిధి. సైబర్ అటాక్ బారిన పడి తమ దృష్టికి వచ్చిన దాదాపు 1400 మంది వినియోగదారులకు ఏం జరిగిందో సమాచారం ఇస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక ఈ స్పైవేర్ ఎలా పనిచేస్తుంది... హైఎండ్ ఎన్స్‌క్రిప్షన్ ఉన్న వాట్సాప్‌ను సైతం ఎలా హ్యాక్ చేయగలిగింది..?

 పెగాసస్ స్పైవేర్ ఎలా పనిచేస్తుంది..?

పెగాసస్ స్పైవేర్ ఎలా పనిచేస్తుంది..?

పెగాసస్ అనే ఈ స్పై వేర్ గత మూడేళ్లుగా ఉంది. ముందుగా హ్యాకర్లు ఎవరినైనా టార్గెట్‌ చేసుకున్నారంటే ముందుగా ఆవ్యక్తి ఫోన్‌కు ఓ లింకును పంపుతారు. పొరపాటున ఆ లింకును క్లిక్ చేస్తే వెంటనే పెగాసస్ ఫోన్‌లో ఇన్స్‌టాల్ అవుతుంది. ఆపై ఇది కంట్రోల్ సర్వర్లతో కాంటాక్ట్‌లోకి వస్తుంది. అక్కడి నుంచి ఫోన్‌లో ఉన్న సమాచారం మొత్తం బయటకు తీస్తుంది. ఇక ఈ స్పైవేర్ చాలా ప్రమాదకరం. ఫోన్‌లోని పాస్‌వర్డ్‌లను , కాంటాక్ట్స్‌ను, టెక్ట్స్‌ మెసేజ్‌లను, క్యాలెండర్ సమాచారం, మెసేజింగ్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్‌ను ఇట్టే హ్యాక్ చేస్తుంది. ఇది ఇంతటితో ఆగిపోదు. వినియోగదారుడి ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ జీపీఎస్ అన్నీ హ్యాకర్ల నియంత్రణలోకి వస్తాయి.

ఇంతకీ వాట్సాప్ సేఫేనా..?

ఇంతకీ వాట్సాప్ సేఫేనా..?

ఇక వాట్సాప్‌ ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తే వాటిని హ్యాక్ చేసింది పెగాసస్. ఎవరైనా వాట్సాప్ నెంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇచ్చి ఇక ఆ వ్యక్తి ఫోన్‌కు యాక్సెస్ పొందుతుంది. వాట్సాప్ చాట్‌లకు అత్యంత సెక్యూరిటీ కల్పించిన వాట్సాప్ యాజమాన్యం... కాల్స్‌కు అదే రకమైన భద్రతను కల్పించడం మరిచింది. ఇక దీన్ని క్రాక్ చేసేందుకు వాట్సాప్ యూనివర్శిటీ ఆఫ్ టొరంటో లోని సిటిజెన్ ల్యాబ్ సహాయం కోరింది. పెగాసస్ అనే స్పైవేర్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ రూపొందించిందని పేర్కొంది. అంతేకాదు దీనికి క్యూసూట్, ట్రైడెంట్ అనే మారుపేర్లు కూడా ఉన్నట్లు ల్యాబ్ అధికారులు వెల్లడించారు. పెగాసస్ ఒక్క ఆండ్రాయిడ్ డివైస్‌లపైనే దాడి చేయడం లేదని ఐఓఎస్‌ల పై కూడా అటాక్ చేయగల సామర్థ్యం ఉందని తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+