అమెరికాలో చైనా బెలూన్ కలకలం-అణు కేంద్రాలపై చక్కర్లు- అయినా కూల్చలేని పరిస్ధితి...

ఆమెరికాలో గతంలో జరిగిన సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రశ్నలే లేవనెత్తేలా చైనా నిఘా బెలూన్ ఒకటి దేశ అణుకేంద్రాలపై చక్కర్లు కొడుతోంది.

ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా భద్రత అంతా డొల్లేనని నిరూపించే మరో ఘటన చోటు చేసుకుంది. గతంలో అమెరికా విమానాలతోనే ఆ దేశంలోని ట్విన్ టవర్స్ ను సెప్టెంబర్ 11 ఆత్మాహుతి దాడులతో తీవ్రవాదులు కూల్చేయడం పెను సంచలనం రేపింది. ఇప్పుడు అంత కాకపోయినా అమెరికాలో భద్రతను ప్రశ్నార్ధకం చేస్తూ ఆ దేశ అణు కేంద్రాలపై చైనా బెలూన్ చక్కర్లు కొట్టినట్లు పెంటగాన్ ఆలస్యంగా గుర్తించింది.

అమెరికా గగనతలంలో చైనా బెలూన్

అమెరికా గగనతలంలో చైనా బెలూన్


అమెరికా గగనతలంలో రెండు రోజులుగా చైనాకు చెందిన ఓ బెలూన్ చక్కర్లు కొడుతున్నట్లు పెంటగాన్ గుర్తించింది. అయితే దీన్ని నిఘా బెలూన్ గానే భావిస్తున్న పెంటగాన్ అధికారులు.. అందులో ప్రజలకు హాని కలిగించే రసాయనాలు కూడా ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో దానిపై దూకుడుగా చర్యలు తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అసలే చైనాతో అమెరికా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ బెలూన్ దేశంలో కలకలం రేపుతోంది.

అణుకేంద్రాలున్న మోంటానాపై సంచారం

పశ్చిమ అమెరికాలోని అణుకేంద్రాలున్న సున్నితమైన నగరం మోంటానాపై ఈ బెలూన్ చక్కర్లు కొడుతుండటం పెంటగాన్ తో పాటు బైడెన్ ప్రభుత్వాన్ని కూడా కలవరపెడుతోంది. దీంతో ఈ బెలూన్ కు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు పెంటగాన్ ప్రయత్నిస్తోంది. ఇది అసలు దేశంలోకి ఎప్పుడు ఎంటరైంది, దీన్ని ఎవరు పంపారు, నిఘా కోసమా, దాడుల కోసమా అనే విషయాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ బెలూన్ వ్యవహారం తేల్చేందుకు నిపుణుల్ని సైతం ప్రభుత్వం రంగంలోకి దించుతోంది.

నిఘా కోసమేనన్న అధికారులు ?

నిఘా కోసమేనన్న అధికారులు ?

పెంటగానే లో పనిచేస్తున్న ఈ సీనియర్ రక్షణ అధికారి దీనిపై స్పందిస్తూ ఇది చైనా బెలూన్ గా నిర్దారించామని, నిఘా సమాచారం సేకరించేందుకే ఇది ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోందని వెల్లడించారు. అలాగే ఇది సున్నితమైన ప్రాంతాల మీదుగా ఎగురుతున్న నేపథ్యంలో వెంటనే ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకునే అవకాశాల్లేవని కూడా తెలిపారు. ముఖ్యంగా అణుకేంద్రాలపై సంచరిస్తున్న బెలూన్ ను కూల్చడం కానీ, ఇతర చర్యలు తీసుకోవడం కానీ చేస్తే అది అంతిమంగా మరింత పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

అయితే ప్రభుత్వం బెలూన్‌ను ట్రాక్ చేయడాన్ని మాత్రం కొనసాగిస్తోందని చెప్పారు. ఇది ప్రస్తుతం కమర్షియల్ ఎయిర్ ట్రాఫిక్ కంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తోందని, భూమిపై ప్రజలకు సైనిక లేదా భౌతిక ముప్పును కలిగించదని గుర్తించారు.

బైడెన్ ఆదేశిస్తే కూల్చివేత ?

బైడెన్ ఆదేశిస్తే కూల్చివేత ?


శ్వేతసౌధం ఆదేశిస్తే మాత్రం బెలూన్‌ను కూల్చివేసేందుకు ఎఫ్-22తో సహా ఫైటర్ జెట్‌లను అమెరికా సిద్ధంగా ఉంచిందని సీనియర్ డిఫెన్స్ అధికారి తెలిపారు. పెంటగాన్ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు. వైట్ హౌస్ కు చేసిన సిఫార్సుల్లో బెలూన్ కూల్చివేత వద్దని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే బెలూన్ మోంటానాలో తక్కువ జనాభా ఉన్న ప్రాంతంపై ఉన్నప్పటికీ, దాని పరిమాణాన్ని బట్టి చూస్తే కూల్చివేత ప్రజలను ప్రమాదంలో పడేస్తుందని భావిస్తున్నారు. అయితే సున్నితమైన సమాచారాన్ని సేకరించకుండా నిరోధించడానికి సైన్యం ఏం చేయబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+