"దమ్ముంటే పట్టుకో.. ఐయామ్ వెయిటింగ్".. ట్రంప్ కు పెట్రో సవాల్..
జనవరి 3 న వెనిజులాపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. వెనిజులా రాజధాని కరాకస్ లోని ఏడు కీలక ప్రాంతాల్లో దాడులు జరిపింది. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుని న్యూయార్క్ కు తరలించారు.
అయితే మదురోను అరెస్ట్ చేసిన తర్వాత లాటిన్ అమెరికాలోని మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిలిపివేయకపోతే వెనిజులాకు పట్టిన గతే మీకూ పడుతుందని ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Colombia’s President Gustavo Petro appears to taunt U.S. President Donald Trump, saying, “Come get me, coward! I’m waiting for you here.” pic.twitter.com/Qk3MfsfsqO
— Geo View (@theGeoView) January 5, 2026
అయితే ట్రంప్ వ్యాఖ్యలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో షాకింగ్ రిప్లై ఇచ్చారు. దమ్ముంటే నన్ను పట్టుకో అంటూ రెచ్చిపోయారు. ఐయామ్ వెయింటింగ్.. నీకోసం నేను ఇక్కడే ఉంటాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొలంబియాను ఓ డ్రగ్ ట్రాఫిక్ వ్యక్తి పాలిస్తున్నాడంటూ పెట్రోపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో పెట్రో ఈ విధంగా స్పందించారు.
" మీరు(అమెరికా) మాపై బాంబులు వేసినా.. కొలంబియా అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కొలంబియా ప్రజలు.. తమకు ఇష్టమైన నాయకుడ్ని కోల్పోతుంటే చూస్తూ ఊరుకోరు. నన్ను భయపెట్టొద్దు. నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను దాడులను, యుద్ధాలు, మరణాలను కోరుకోవడం లేదు. పిరికిపంద చర్యలు వద్దు. దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ మాట్లాడుకుందాం. ఇంటెలిజెన్స్ తో మాట్లాడుకుందాం" అని ట్రంప్ కు కొలంబియా అధ్యక్షుడు పెట్రో సవాల్ విసిరారు.

అంతకుముందు ట్రంప్ మాట్లాడుతూ.. కొలంబియా అధ్యక్షుడు పెట్రోపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తి చేతిలో కొలంబియా ఉందని అన్నారు. కొలంబియా బలహీన దేశం.. ఈ దేశాన్ని ఓ బలహీన వ్యక్తి పాలిస్తున్నాడు. ఇది ఎక్కువ రోజులు జరగదు.. అని ట్రంప్.. పెట్రోపై కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications