పాకిస్తాన్‌లో కూలిపోయిన విమానం: ప్రఖ్యాత సింగర్ సహా 48 మంది మృతి?
పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. హవేలియన్ పిప్లియన్ వద్ద ఈ విమానం కూలింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. హవేలియన్ సబర్బన్ గ్రామం పిప్లియన్ వద్ద ఈ విమానం కూలింది. ఈ ఘటనలో 48 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఈ విమానం ఉత్తరాది పట్టణమైన చిత్రాల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అయింది. విమానంలో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. 6గురు క్యాబిన్ క్రూ ఉన్నారు. ఇస్లామాబాద్ వెళ్తున్న వెళ్తోంది. బయలుదేరిన కాసేపటికే రాడార్ నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కూలిపోయినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
విమానంలో 9 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం 48 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఓ ప్రఖ్యాత గాయకుడి కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుందని, ఎవరూ బతికుండే అవకాశంలేదని సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు చెబుతున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అబొటాబాద్ ప్రాంతంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications