టర్కీలో రన్‌వే నుండి పక్కకు వెళ్ళిన విమానం

Posted By:
Subscribe to Oneindia Telugu

అంకారా: టర్కీకి చెందిన పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి రన్‌ వేపై నుంచి పక్కకు వెళ్లినట్లు టర్కీ మీడియా ప్రకటించింది. టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రబ్‌జాన్‌ పట్టణానికి 162 మంది ప్రయాణీకులతో విమానం బయల్దేరింది.

అయితే విమానం ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పింది. అయితే సముద్రంలో కూలిపోయే ప్రమాదం ఉంది. సముద్రానికి సమీపంలోనే ఈ విమానం నిలిచిపోయింది. ఈ ప్రమాదం నుండి ప్రయాణీకులు తృటిలో తప్పించుకొన్నారు.

Plane skids off runway and gets stuck in mud on cliff edge in Turkey

ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పిన విమానం.. కొంచెం ఉంటే సముద్రంలోకి దూసుకెళ్లేదని తెలిపింది. సముద్రానికి కొద్ది మీటర్ల దూరంలో విమానం ఆగినట్లు చెప్పింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అయితే, విమానం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని చెప్పింది.

ఫైర్‌ ఇంజన్లు హూటాహుటిన అక్కడికి చేరుకుని పొగను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొంది. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ట్రబ్‌జాన్‌ ప్రభుత్వం తెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Panicked passengers scream as the aircraft nosedives off a coast and is left dangling precariously on a cliff face near the sea.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి