ప్రధాని మోదీ- బైడెన్ భేటీ : భారత్ తటస్థ వైఖరిపై అభ్యంతరాల వేళ - అమెరికాకు తేల్చి చెప్పేస్తారా ..!!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య పట్ల భారత్‌ తటస్థ వైఖరిపై అమెరికా పదేపదే అభ్యంతరాలు లేవనెత్తుతున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తి కరంగా మారుతోంది. వర్చువల్‌గా జరిగే నేటి భేటీలో రష్యా అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఇండో-పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటులో పురోగతి, మౌలిక వసతులపై ఈ ఇరువురు ముఖ్య నేతలు చర్చించనున్నారు.

ఇద్దరు అగ్రనేతల భేటీతో..

ఇద్దరు అగ్రనేతల భేటీతో..

రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి సమాంతరంగా ఇది జరుగుతుందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పాకిస్థాన్‌, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం వంటి అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. ఉక్రెయిన్ పై మాస్కో సైనికచర్యను వ్యతిరేకించాలని బైడెన్‌ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్‌ తటస్థ వైఖరి పైన చర్చ ఆసక్తి కరంగా మారింది.

భారత్ వైఖరి పై అమెరికా అభ్యంతరం వేళ

భారత్ వైఖరి పై అమెరికా అభ్యంతరం వేళ

రష్యా నుంచి చమురు కొనుగోలు, రూపాయి-రూబుల్‌ వర్తకానికి ప్రాధాన్యం ఇవ్వడంపై అగ్రరాజ్యం అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇద్దరు ఒకే సమావేశంలో కలుసుకోవటం ఇదే ప్రధమం. దీంతో.. ఈ అంశం పైన బైడెన్ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వస్తాయి.. మోదీ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. నెలరోజుల వ్యవధిలో ఇరు దేశాధినేతలు సమావేశం కావటం ఇది రెండోసారి. ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. చేసింది.

రష్యాకు దూరంగా ఉండాలని కోరుతారా

రష్యాకు దూరంగా ఉండాలని కోరుతారా

రష్యాకు దూరంగా ఉండాలి... రష్యాకు, అలీనోద్యమానికి భారత్‌ దూరం జరగాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికాలో జో బైడెన్‌ సర్కారు శనివారం పేర్కొంది. భారత్, అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం అద్భుతంగా ముందుకు సాగుతోందని పేర్కొంది. ఈ ఇద్దరు నేతల భేటీ తరువాత ఇరు దేశాలకు చెందిన ఇద్దరు చొప్పున మంత్రులు సైతం చర్చల్లో పాల్గొననున్నారు. భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌.. అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చర్చలు సాగించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+