ఇండోనేషియాలో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం: ప్రవాసుల ఉత్సాహం

జకార్తా: ఆసియాన్-భారత్ సదస్సు, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం ఇండోనేషియాలో అడుగుపెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనకు ఇండోనేషియా ప్రభుత్వ పెద్దలతోపాటు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. జకార్తా నగరంలోని రిట్జ్ కార్లటన్ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోడీ.. మోడీ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

మువ్వెన్నెల జెండాలు చేతపట్టుకొని మోడీకి బ్రహ్మరథం పట్టారు. హర్ హర్ మోడీ హర్ ఘర్ మోడీ అంటూ నినదించారు. చిన్నారులు, మహిళలు సైతం పెద్ద సంఖ్యలో వచ్చి ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పిల్లలను ఆప్యాయంగా పలకరించారు ప్రధాని మోడీ .

 PM Modi Arrives In Indonesia To Attend ASEAN-India, East Asia Summits, indian diaspora welcomes him

ప్రవాసభారతీయులు ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగారు. మహిళా ప్రవాసులు మోడీకి కరచాలనం చేశారు. జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోడీకి ఇండోనేషియా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుస్టీ ఆయు బింటాంగ్ ధర్మావతి స్వాగతం పలికారు. ఇండోనేషియా సంప్రదాయ నృత్యంతో మహిళలు మోడీకి ఘనస్వాగతం పలికారు.

ఆసియాన్-భారత్ ,తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాలతో భారతదేశ భాగస్వామ్యం, భవిష్యత్తు రూపురేఖలపై చర్చిస్తారు.
'జకార్తాలో అడుగు పెట్టాను, వివిధ దేశాల అధినేతలతో కలిసి మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నాను' అని ప్రధాని మోడీ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

 PM Modi Arrives In Indonesia To Attend ASEAN-India, East Asia Summits, indian diaspora welcomes him

'ప్రధానమంత్రి మోడీ జకార్తా చేరుకున్నారు. ముఖ్యమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఆసియా నాయకులతో పరస్పర చర్చ జరిగే అవకాశం ఉంది' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఎక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో పాల్గొంటారు. తూర్పు ఆసియా సదస్సుకు హాజరవుతారు. సమావేశాలు ముగిసిన వెంటనే మోడీ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారతదేశం జి20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఢిల్లీకి తిరిగి రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+