ట్రంప్‌కు ప్రధాని మోదీ సపోర్ట్!
గాజాలో యుద్ధాన్ని అంతం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన కొత్త ప్రణాళికకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆమోదం తెలిపారు. ఈ ప్రణాళికను భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. ఈ ప్రణాళిక పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీ ప్రజలు, విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక, శాశ్వత శాంతి, భద్రత, అభివృద్ధికి మార్గాన్ని తెరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్లాన్‌ను స్వాగతించిన ప్రధాని మోదీ
గాజా యుద్ధాన్ని ముగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సమగ్ర ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. "గాజా యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ ప్రణాళిక పాలస్తీనియన్, ఇజ్రాయెలీ ప్రజలతో పాటు విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక, శాశ్వత శాంతి, భద్రత, అభివృద్ధికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ ప్రయత్నంతో యుద్ధాన్ని ముగించడానికి, శాంతిని నిర్ధారించడానికి సంబంధించిన అన్ని పక్షాలు అధ్యక్షుడు ట్రంప్ చొరవ వెనుక ఏకమవుతాయని మేము ఆశిస్తున్నాం" అని ప్రధాని మోదీ పోస్ట్‌లో పేర్కొన్నారు.

We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…
— Narendra Modi (@narendramodi) September 30, 2025
ట్రంప్ శాంతి ప్రణాళికలోని ముఖ్యాంశాలు
ట్రంప్ ప్రకటించిన 21 సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకరించేందుకు హమాస్‌కు 72 గంటల సమయం ఉంది. ఈ ప్రణాళికలోని ముఖ్యాంశాలు:
ఇరు పక్షాలు సంతకం చేయగానే తక్షణమే సీజ్‌ఫైర్ ప్రకటిస్తారు. గాజా తాత్కాలిక పాలనా బాధ్యతలను టెక్నోక్రాటిక్ పాలస్తీనా కమిటీకి అప్పగిస్తారు. దీనిని అధ్యక్షుడు ట్రంప్, మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని అంతర్జాతీయ బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షిస్తుంది.గాజాను పునరుద్ధరించడానికి, పాలస్తీనా, ప్రపంచ నిపుణులతో కూడిన కొత్త గవర్నింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. పాలస్తీనియన్ పౌరులను గాజాను విడిచి వెళ్లవలసిందిగా నిర్బంధించడం జరగదు. ఇజ్రాయెల్ 72 గంటల్లోగా బంధీలుగా ఉన్న అందరినీ (బతికున్న లేదా మరణించిన) అప్పగిస్తుంది.ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలను, 1700 మంది గాజా పౌరులను విడుదల చేస్తుంది.
ఆయుధాలు విడిచిపెట్టి, శాంతికి హామీ ఇచ్చే హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుంది, వారు సురక్షితంగా బయటకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గాజాలో మానవీయ సాయం, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, రహదారుల పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయంతో సహాయ సామగ్రిని అందిస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఒక ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, అందుకు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.
అమెరికా పూర్తి మద్దతు
ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము శాంతి కోసం ఒక ఒప్పందానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే హమాస్ ఈ ఒప్పందాన్ని తిరస్కరిస్తే, ఇజ్రాయెల్‌కు చర్యలు తీసుకోవడానికి అమెరికా పూర్తి మద్దతు లభిస్తుందని ఆయన హెచ్చరించారు.
నెతన్యాహు వైఖరి.. పాలస్తీనా స్పందన
ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రతిపాదన వెలువడింది. ఈ సమావేశం ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత నెతన్యాహు వైట్‌హౌస్‌ను సందర్శించడం ఇది నాలుగోసారి.నెతన్యాహు ట్రంప్‌ను ఇజ్రాయెల్ స్నేహితుడిగా ప్రశంసించారు. అయితే ఈ ప్రణాళికలోని కొన్ని అంశాలైన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు, పాలస్తీనా రాష్ట్ర స్థాపన వంటి వాటి నుంచి దూరంగా ఉన్నారు. పాలస్తీనా అథారిటీ మాత్రం ట్రంప్ ప్రయత్నాలను స్వాగతించింది. ఒక సమగ్ర ఒప్పందానికి చేరుకోవడానికి అమెరికా, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది. అయితే హమాస్ తమకు ఇంకా ట్రంప్ ప్రతిపాదన అందలేదని తెలిపింది.
గత వారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (UNGA) కూడా అమెరికా ఈ 20 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఇందులో శాంతియుత సహజీవనం కోసం ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య కొత్త చర్చలకు పిలుపునిచ్చారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications