ఇజ్రాయెల్ గడ్డపై ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన నెతన్యాహు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ తన సతీమణి సారాతో కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన భాగస్వామ్యం, వ్యూహాత్మక ఒప్పందాల గురించి వివరిస్తోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ లో ఘన స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ లో ఆయన విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ దేశ ప్రధాని నెతన్యాహు తన సతీమణి సారాతో కలిసి ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయంలోనే ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. మోదీ చివరగా 2017 లో ఇజ్రాయెల్ లో పర్యటించారు. దాంతో ఇజ్రాయెల్ లో పర్యటించిన మొదటి భారత ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు.
#WATCH | Tel Aviv, Israel: PM Narendra Modi received ceremonial welcome. Israeli Prime Minister Benjamin Netanyahu, along with his wife Sara Netanyahu, received PM Modi at the airport
— ANI (@ANI) February 25, 2026
(Source: Reuters) pic.twitter.com/8fHvSZWjdC
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డిఫెన్స్ రంగాలపై ప్రసంగించనున్నారు. అలాగే ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనం నెస్సెట్ లో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీ, ఎగ్జిబిషన్ సెంటర్ లో పర్యటించనున్నారు. అనంతరం ప్రధాని నెతన్యాహు ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్ లో ప్రధాని మోదీ పాల్గొంటారు.

అలాగే ఫిబ్రవరి 26 గురువారం.. ప్రధాని మోదీ యద్ వషేమ్(ఇజ్రాయెల్ అధికారిక మెమోరియల్, 1953లో స్థాపించారు. 60లక్షల మంది జువిస్ ను నాజీలు హతమార్చారు. అందుకు నివాళిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు) లో నివాళులు అర్పించనున్నారు. అయితే ఇజ్రాయెల్ లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జెరుసలేం పోస్టు పత్రికలో ఫ్రంట్ పేజీలో ప్రధాని మోదీకి ఆహ్వానం అంటూ ప్రచురించాయి. ఇక ఈ పర్యటనపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. " నా స్నేహితుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు నేను ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నాను. ఫిబ్రవరి 25-26 తేదీల్లో ఈ పర్యటన ఉంటుంది" అని ప్రధాని మోదీ తెలిపారు.












Click it and Unblock the Notifications