రష్యా డ్రోన్లు కూల్చివేత- పొరుగు దేశం వరకూ విస్తరించిన భీకర యుద్ధం?

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.

అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది.

Poland shot down drones that entered its airspace during a Russian strike on Ukraine

ఈ యుద్ధం మరింత విస్తరించినట్టే కనిపిస్తోంది. పోలెండ్ గగనతలంలోకి రష్యా డ్రోన్లు, వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రవేశించడమే దీనికి నిదర్శనం. వీటిని తాము కూల్చివేసినట్లు పోలెండ్ ఆర్మీ ప్రకటించింది. తమ గగనతలాన్ని డ్రోన్ తరహా వస్తువులు పలుమార్లు ఉల్లంఘించాయని పోలండ్ ఆపరేషనల్ కమాండ్ వెల్లడించింది. వాటిని నిర్వీర్యం చేస్తోన్నామని, ఈ ఆపరేషన్ కొనసాగుతోందని తెలియజేసింది.

ఉక్రెయిన్ తో సరిహద్దులను పంచుకుంటుంటుంది పోలెండ్. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలపై వైమానిక దాడులను నిర్వహించే క్రమంలో కొన్ని డ్రోన్లు ఆ దేశ సరిహద్దులను దాటుకున్నట్లు తేలింది. తమ దేశ గగనతలంలోకి అవి ప్రవేశించడంతో వాటిని నేలకూల్చింది పోలాండ్. తమ గగనతలాన్ని రక్షించే క్రమంలో ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని తెలిపింది. రష్యా డ్రోన్లను అడ్డుకోవడానికి మిత్రదేశాల ఎయిర్ క్రాప్ట్ లను కూడా మోహరించినట్లు పేర్కొంది.

ఈ క్రమంలో నాలుగు ప్రధాన విమానాశ్రయాలు మూతపడ్డాయి పోలెండ్ లో. వార్సాలోని అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ జాబితాలో ఉంది. దీంతో పాటు రెస్జోవ్-జాసియోంకా, వార్సా మోడ్లిన్, లబ్లిన్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో ఎయిర్‌మెన్‌ నోటీస్ (NOTAM) కూడా జారీ చేసింది. రష్యా డ్రోన్లు పోలెండ్ గగనతలంలోకి ప్రవేశించడాన్ని అటు నాటో కూడా తప్పు పట్టింది. జామోస్క్ నగరానికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+