గూగుల్ మేనేజర్ రేప్: చంపింది సీరియల్ కిల్లర్ !

న్యూయార్క్: గూగుల్ న్యూయార్క్ కార్యాలయంలో అకౌంట్స్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వనెస్సా మర్కోటీ (27)ని రేప్ చేసిన ఓ సీరియల్ కిల్లర్ తరువాత ఆమెను హత్య చేశాడని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు.

వనెస్సా మర్కోటీ హత్య జరగడానికి ఐదు రోజుల క్రితం న్యూయార్క్ లో స్పీచ్ పథలోజిస్ట్ గా పని చేస్తున్న కరీనా వెట్రానో (30) అనే యువతి హత్యకు గురైయ్యింది. కరీనా వెట్రానో మీద అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు చెప్పారు.

Police probing the deaths of two young women raped and murdered while out jogging

హత్యకు గురైన కరీనా వెట్రానో, వనెస్సా మర్కోటీలు అందమైన, ఆకర్షణీయమైన యువతులే అని పోలీసులు అన్నారు. వీరిద్దరూ జాగింగ్ కు వెలుతున్న సమయంలో అత్యాచారానికి గురైన తరువాత దారుణ హత్యకు గురైనారు.

ఇద్దరి హత్యలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని పోలీసులు అన్నారు. గత ఆదివారం గూగుల్ కార్యాలయం మేనేజర్ వనెస్సా మర్కోటీ హత్యకు గురైయ్యింది. వనెస్సా హత్య జరగక ముందు ఐదు రోజుల క్రితం సమీపంలోని పార్క్ లో జాగింగ్ చెయ్యడానికి సైకిల్ మీద వెలుతున్న కరీనా వెట్రానో హత్యకు గురైయ్యింది.

Police probing the deaths of two young women raped and murdered while out jogging

కరీనా వెట్రానో తండ్రి మరణించిన కుమార్తె సహాయార్థం గోఫండ్ మీ అనే ఫేస్ బుక్ పేజీ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆయనకు లక్ష డాలర్లు విరాళంగా అందింది. తన కుమార్తెను హత్య చేసిన హంతకుడిని పట్టించిన వారికి ఆ లక్ష డాలర్లు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు.

అదేవిధంగా హంతకుడిని పట్టించిన వారికి 20 వేల డాలర్లు బహుమతిగా ఇస్తామని న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. కరీనా వెట్రానో హత్య జరగక మూడు రోజుల ముందు అలెగ్జాండ్ర నికోలెట్టీ అనే యువతి హత్యకు గురైయ్యింది.

అయితే అలెగ్జాండ్ర మీద అత్యాచారం జరగలేదని, హంతకుడు తుపాకితో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. ఒకే ప్రాంతంలో 10 రోజుల్లో ముగ్గురు అందమైన యువతులు హత్యకు గురి కావడంతో స్థానికులు హడలిపోతున్నారు. సీరియల్ కిలర్లర్ ను అరెస్టు చెయ్యడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+