‘ఆ పోర్న్ స్టూడియోను ఫ్లాట్లుగా అమ్మనివ్వం’
లండన్: ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ నగరంలోని బ్లూ మూవీ స్టూడియో.. ఇప్పటివరకు శృంగార సన్నివేశాల చిత్రీకరణలతో రద్దీగా ఉండేది. అంతేగాక, ఈ స్టూడియోలోనే నిత్యం పోర్న్ సినిమాలు నిర్మించి.. వాటిని లైవ్ స్ట్రీమింగ్ చేసేవారు. అయితే, ఈ స్టూడియోను ఇప్పుడు ఫ్లాట్లుగా మార్చి అమ్మేయాలని తాజాగా దాని యజమాని నిర్ణయించడం కలకలం రేపుతోంది.
కాగా, ఈ నిర్ణయాన్ని స్థానిక కాలనీ వాసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం. బ్లూ మూవీ స్టూడియోను ఫ్లాట్లుగా చేసి అమ్మితే.. వలసదారులే వాటిని కొనుగోలు చూపేందుకు ఆసక్తి చూపుదారని, పోర్న్‌స్టార్లు అంటే వలసదారులకు చాలా ఇష్టమని స్థానిక కాలనీ వాసులు వాదిస్తున్నారు.

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 50 మంది కాలనీవాసులు ఆందోళనలకు దిగారు. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా మారిస్తే.. ఇక్కడి తమ ఇళ్లను అమ్మేసుకోని వేరే చోటుకి వెళ్లిపోతామని వారిలో కొందరు హెచ్చరిస్తున్నారు. బ్రిస్టల్ సెయింట్ జార్జ్‌లోని ఈ స్టూడియోను నిన్నమొన్నటి వరకు ఫిల్ బేరి స్టూడియోగా వాడుకున్నాడు.
పోర్న్ స్టార్ క్యాథీ బేరి భర్త అయిన ఫిల్ల్ ఈ నివాసంలో పోర్న్ దృశ్యాలు తీసి.. వాటిని లైవ్ ప్రసారం చేసేవాడు. అయితే, దీని యజమాని మైక్ హాబిన్స్ ఇంటిని 40 డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లుగా మార్చి.. అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా నగరంలో నెలకొన్న ఇళ్ల సంక్షోభం పరిష్కారానికి కొంత సహకారం అందించాలని ఆయన భావిస్తున్నారు. అయితే, హాబిన్స్ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.












Click it and Unblock the Notifications