ఎంహెచ్370: మరో ట్విస్ట్, కాక్‌పిట్‌లో పని చేయకుండా..
సిడ్నీ/కౌలాలంపూర్: దాదాపు నాలుగు నెలల క్రితం గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 విషయంలో రోజుకో అంశం వెలుగులోకి వస్తుంది. విచారణాధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. తాజాగా విచారణలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. హైజాక్ కోణం మరోసారి తెర పైకి వచ్చింది.
గల్లంతైన మలేషియా విమానంలోని కాక్ పిట్‌లో గల ఎక్విప్‌మెంట్స్‌ను హైజాకర్స్ పని చేయకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని విచారణ అధికారులు భావిస్తున్నారు.

రాడర్ గుర్తించకుండా ఉండేందుకు హైజాకర్స్ కాక్ పిట్‌లోని ఎక్విప్‌మెంట్స్‌ను పని చేయకుండా చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని విచారణ అధికారులు సోమవారం తెలిపారు.
ఆస్ట్రేలియన్ ట్రాన్సుపోర్ట్ సేఫ్టీ బ్యూరో సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. గల్లంతైన మలేషియా విమానం కౌలాలంపూర్ నుండి బయలుదేరిన గంటన్నరలో పవర్‌కు అంతరాయం ఏర్పడిందట. కాక్ పిట్‌ను పని చేయకుండా ఎవరైనా చేశారా అనే కోణంలోను విచారణ అధికారులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications