ఏ క్షణంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం... హోరాహోరీగా, క్రూరంగా...
మూడో ప్రపంచ యుద్ధమే గనుక వస్తే.. గత ప్రపంచ యుద్ధాల మాదిరిగా నెలలు, ఏళ్ల తరబడి జరగదు. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుంది.
న్యూయార్క్: మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంలోకి వచ్చిందని, ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని హెచ్చరిస్తూ అనానిమస్ (గుర్తుతెలియని)గా చెప్పుకుంటున్న హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.
గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది.

ఉత్తరకొరియా పరిణామాలే...
మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు.

మోహరించిన అమెరికా సైన్యం...
దక్షిణ కొరియాలో అమెరికా థాడ్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆ దేశ సైన్యాన్ని, సైనిక సంపత్తిని కూడా హ్యాకర్లు యుద్ధ సన్నాహాలుగానే పేర్కొన్నారు.

చైనా హెచ్చరికలు కూడా...
ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి చైనా పౌరులను వెనక్కి రావాల్సిందిగా చైనా ప్రభుత్వం ట్రావెల్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే ప్రాణాలతో బయటపడేందుకు పది నిమిషాలకు మించి సమయం దొరకదని చైనా పేర్కొంది.

ప్రపంచం.. మూడు కూటములుగా..
ప్రపంచ దేశాలు మూడు బృందాలుగా విడిపోయి పరస్పరం యుద్ధం చేస్తాయని హ్యాకర్లు పేర్కొన్నారు. అయితే ఆ బృందాలు ఎవరి నాయకత్వాన ఏర్పాడతాయనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. అమెరికా, ఉత్తరకొరియా రెండు బృందాలుగా చీలిపోతే మరి మూడో బృందం ఏ దేశం నాయకత్వాన ఏర్పడుతుందనే విషయంలో హ్యాకర్ల మాటల్లో స్పష్టత లేదు.

రష్యా ఊసే లేదంటే...
రష్యా పేరును అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని తాము చెప్పడం లేదని, యుద్ధం జరిగేందుకు కచ్చితమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రమే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. అనానిమస్ హ్యాకర్లు విడుదల చేసిన ఏడు నిమిషాల నిడివిగల వీడియోలో మాట్లాడిన హ్యాకర్ తనను గుర్తుపట్టకుండా ముఖానికి చిత్రమైన మాస్క్ ధరించాడు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications