సినీ నటి మేఘన్‌తో హ్యరీ వివాహం, ప్రిన్స్ కంటే 3 ఏళ్ళు పెద్దది

బ్రిటన్ యువరాజు హ్యరీ, సినీ నటి మేఘన్ మార్కెల్‌ వివాహం 2018లో జరగనుంది. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం జరపాలని నిర్వహించినట్టు యువరాజు హ్యరీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ సోమవారం నాడు ప్రకటించారు.

లండన్: బ్రిటన్ యువరాజు హ్యరీ, సినీ నటి మేఘన్ మార్కెల్‌ వివాహం 2018లో జరగనుంది. రెండు కుటుంబాల అంగీకారంతోనే ఈ వివాహం జరపాలని నిర్వహించినట్టు యువరాజు హ్యరీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ సోమవారం నాడు ప్రకటించారు.

బ్రిటన్ యువరాజు వివాహం గురించి కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. సినీ నటితో బ్రిటన్ యువరాజు వివాహం చేసుకొంటారనే ప్రచారం వాస్తవ రూపం దాల్చింది. కొంతకాలంగా ప్రిన్స్ హ్యరీ సినీ నటి మేఘన్‌మార్కెల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

ప్రిన్స్ హ్యరీతో సినీ నటి మేఘన్ మార్కెల్‌ ప్రేమలో పడడంతో ఆమెకు మరింత క్రేజీ వచ్చింది. వచ్చే ఏడాదిలో వీరిద్దరి వివాహం జరపాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నారు.

 2018లో ప్రిన్స్ హ్యరీ, మేఘన్ మార్కెల్ వివాహం

2018లో ప్రిన్స్ హ్యరీ, మేఘన్ మార్కెల్ వివాహం

కొంతకాలంగా ప్రేమించుకొంటున్న ప్రిన్స్ హ్యరీ, సినీ నటి మేఘన్ మార్కెల్ వివాహం 2018లో చేయనున్నట్టు ప్రిన్స్ చార్లెస్ సోమవారం నాడు ప్రకటించారు. ఇటీవల నటి మేఘన్ మార్కెల్‌, తన కుమారుడు హ్యారీల నిశ్చితార్థం జరిపించామని చార్లెస్ పేర్కొన్నారు. నటి మార్కెల్ తల్లిదండ్రుల అంగీకారం తెలపడంతో పాటు హ్యారీని ఆశీర్వదించారని వివరించారు.

 హ్యారీ ప్రేమతో మేఘన్ టాప్..

హ్యారీ ప్రేమతో మేఘన్ టాప్..

మేఘన్ మార్కెల్ (36), ప్రిన్స్ హ్యారీ(33)లు కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. దీంతో నటి మేఘన్‌కు భలే పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఏకంగా మోస్ట్ సెర్చ్‌డ్‌ నటిగా 2016 ఏడాదికి గానూ మేఘన్ తన పేరు సంపాదించింది.

అందరూ అనుకున్నదే జరిగింది. హాలీవుడ్ నటి, యువరాజుల ప్రేమ త్వరలో ఫలించనుంది. బ్రిటన్‌ యువరాజు హ్యారీ వివాహం వచ్చే ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రిన్స్ హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

 హ్యరీ కంటే మూడేళ్ళు పెద్దది

హ్యరీ కంటే మూడేళ్ళు పెద్దది

బ్రిటన్ యువరాజు హ్యారీ కంటే సినీ నటి మేఘన్ మార్కెల్ మూడేళ్ళు పెద్దది. నటి మేఘన్ మార్కెల్‌తో ప్రిన్స్ హ్యరీ డేటింగ్ చేస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. 'మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ఎంతో సంతోషంగా ఉన్నామంటూ' తమ ప్రేమ విషయాన్ని నటి మేఘన్ కూడా ఇటీవల పెదవి విప్పింది.దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది.

 సూట్స్ షూటింగ్ సమయంలో ప్రేమ

సూట్స్ షూటింగ్ సమయంలో ప్రేమ

గతేడాది జూలైలో 'సూట్స్‌' షూటింగ్ సమయంలో టోరంటోలో తొలిసారి వీరి చూపులు కలిశాయి. అక్కడి నుంచి వీరు తరచుగా కలుసుకోవడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. నిర్మాణ ట్రెవర్ ఇంగెల్సన్ తో మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న మేఘన్ మార్కెల్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో యువరాజు హ్యారీతో తన పరిచయాన్ని ప్రేమగా మలుచుకుని పెళ్లి పీటలెక్కనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+