వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్ క్రైం, ఎన్నికల్లో జోక్యంపై చర్చలు: పుతిన్- బైడెన్ భేటీ

|
Google Oneindia TeluguNews

చిరకాల ప్రత్యర్థులు అమెరికా, రష్యా దేశ అధినేతలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. బైడెన్‌, పుతిన్‌ జెనీవాలో సమావేశం అయ్యారు. వీరిరువురు దశాబ్దకాలం తర్వాత కలుసుకోవడం విశేషం. చివరిసారిగా పుతిన్‌ ప్రధానిగా.. బైడెన్‌ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో 2011 మార్చిలో సమావేశమయ్యారు. మరోవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు భారీగా క్షీణించిన సమయంలో వీరి భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 putin-baiden discuss cyber crime

ఉక్రెయిన్, మానవ హక్కులు, సైబర్‌ దాడులు, అమెరికా ఎన్నికల్లో రష్యా పాత్ర వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు పుతిన్‌ను బైడెన్‌ కిల్లర్‌గా, సరైన ప్రత్యర్థిగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్ర ఉందంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో ఇరువురి మధ్య సమావేశాలు జరుగుతుండడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

సైబర్‌క్రైం, అమెరికా ఎన్నికల్లో జోక్యం సహా ఇరు దేశాల మధ్య సంబంధాల క్షీణతకు దారితీసిన పలు అంశాలపై రష్యాతో చర్చించేందుకు అవకాశంగా దీన్ని బైడెన్‌ అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసుకోవడానికీ ఇదే అవకాశం అని అభిప్రాయపడ్డారు.

English summary
russia president putin america president baiden discuss cyber crime and other key issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X