మాస్కో నుంచి వెళ్లిపోయిన పుతిన్- క్లారిటీ ఇచ్చిన క్రెమ్లిన్

మాస్కో: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అంతర్యుద్ధం మొదలైందక్కడ. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కుడిభుజంలా ఉంటూ వచ్చిన వాగ్నర్ మెర్సినరి గ్రూప్ ప్రైవేట్ ఆర్మీ.. తిరుగుబాటును లేవనెత్తింది. రష్యా సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడమే దీనికి కారణమైంది. ఈ ఘటన తరువాత వాగ్నర్ గ్రూప్ అడ్డం తిరిగింది. అంతర్యుద్ధాన్ని మొదలుపెట్టింది.

కొన్ని గంటల వ్యవధిలోనే ఇది ఉధృత రూపాన్ని దాల్చింది. రెండు నగరాలు- రొస్టొవ్, వొరొనెజ్‌ను సైతం వాగ్నర్ గ్రూప్ సొంతం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా నగరాల్లో పహారాలో ఉన్న రష్యా సైనికులు- ఈ ప్రైవేట్ ఆర్మీకి లొంగిపోయింది. వొరొనెజ్ టౌన్ శివార్లలోని ఆయిల్ డిపో ధ్వంసమైంది. ఇందులో నుంచి దట్టమైన పొగలు వెలువడటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల‌్‌గా మారాయి.

 puthin

అటు రాజధాని మాస్కో నగరానికి వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ ఆర్మీ సమీపిస్తోంది. మాస్కోకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపెట్స్క్ రీజియన్‌కు ఈ ఆర్మీ చేరుకుంది. వాగ్నర్ ఆర్మీని నిలువరించడానికి రష్యా సైన్యం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సొంత నగరాలపై బాంబు దాడులు చేయడానికి వారు అంగీకరించట్లేదు. లిపెట్స్క్ రీజియన్‌లో మోహరించిన రష్యా సైనికుల్లో సుమారు 180 మంది స్వచ్ఛందంగా తప్పుకొన్నట్లు వార్తలు వస్తోన్నాయి.

మాస్కో నగరానికి సమీపించడం ఖాయమనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి షెరెమెట్యేవో అలెగ్జాండర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. పలువురు విదేశీయులు మాస్కో నుంచి వెళ్లిపోతోన్నారు. ఇక్కడ నివసించే పలువురు పారిశ్రామికవేత్తలు తమ ప్రైవేట్ జెట్లల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు తరలి వెళ్తోన్నారు. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రైవేట్ జెట్స్, తేలికపాటి విమానాల రాకపోకలు పెరిగాయి.

ఈ క్రమంలోనే వ్లాదిమిర్ పుతిన్ కూడా మాస్కోను వదలి వెళ్లినట్లు వార్తలొస్తోన్నాయి. తన ప్రెసిడెన్షియల్ జెట్‌లో ఆయన మాస్కోలోని డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దీనిపై ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఈ వార్తలు వెలువడిన కొద్దిసేపటికే రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం.. క్రెమ్లిన్ స్పందించింది. పుతిన్.. క్రెమ్లిన్‌లోనే ఉన్నారని తెలిపింది. ఆయన సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్లినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని వివరణ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+