భారత మాజీ నేవీ అధికారులకు 3 నుంచి 25 ఏళ్లు జైలు శిక్షలు- ఖతార్ కోర్టు కీలక తీర్పు..
ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన 8 మంది నేవీ మాజీ అధికారులకు గతంలో విధించిన మరణశిక్షను జైలు శిక్షగా మారుస్తూ ఖతార్ కోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎనిమిది మందికి విభిన్న గడువులతో జైలుశిక్షలు విధిస్తూ ఇవాళ తీర్పులో క్లారిటీ ఇచ్చింది. దీంతో సుదీర్ఘకాలం ఈ నేవీ మాజీ అధికారులు ఖతార్ జైళ్లలో మగ్గక తప్పేలా లేదు. ఈ మేరకు ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరుగుతోంది.
ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారుల మరణశిక్షను జైలు శిక్షగా మార్చుతూ ఖతార్‌లోని అప్పీల్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. వీరిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా జైలుశిక్షలు నిర్ధారిస్తూ ఇవాళ ఖతార్ కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ ఎనిమిది మందికి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ నిర్ధారించింది. అయితే ఈ తీర్పుపైనా అప్పీలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఖతార్‌లోని అప్పీలేట్ కోర్టు ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్షను మూడు సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య జైలు శిక్షగా మార్చినట్లు జాతీయ వార్తా పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. మరణశిక్షలో ఉన్న ఏడుగురు మాజీ నేవీ అధికారులు, ఓ సెయిలర్ లలో ఇప్పుడు ఒకరికి 25 ఏళ్ల జైలు శిక్ష, నలుగురికి 15 ఏళ్ల జైలు, ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.ఈ ఎనిమిది మందిలో ఏకైక నావికుడికి అత్యల్ప శిక్ష పడింది. అయితే దహ్రా గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన అధికారికి కఠినమైన శిక్ష విధించారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications