ప్రపంచంలోనే తొలి స్పెర్మ్ రేస్.. ఎక్కడో తెలుసా? విజేతను ఎలా ప్రకటిస్తారు?
కోళ్ల పందెం తెలుసు.. గుర్రపు పందెం తెలుసు ఈ స్పెర్మ్ రేస్ ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రపంచంలోనే తొలిసారిగా స్పెర్మ్ రేస్ జరగనుంది. తగ్గుతున్న పురుషుల సంతానోత్పత్తి రేటుపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ స్పెర్మ్ రేస్ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఏప్రిల్ 25న జరగనుంది. ఈ రేసులో దాదాపు 1000 మందికిపైగా పాల్గొనబోతున్నారు. మరి ఈ రేస్ ఎలా జరుగుతుంది? విజేతను ఎలా ప్రకటిస్తారు?
ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఈ నెల 25న జరుగనుంది స్పెర్మ్ రేస్ అనే స్టార్టప్ కంపెనీ పురుషుల సంతానోత్పత్తి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ రేస్‌లో దాదాపు 1,000 మంది పాల్గొంటారని అంచనా. రేస్ కోసం ప్రత్యేకంగా 20 సెంటీమీటర్ల పొడవైన మైక్రో స్కోపిక్ రేస్ ట్రాక్‌లను రూపొందించారు. పాల్గొనేవారి వీర్యం నమూనాలను ఈ ట్రాక్‌లపై ఉంచుతారు. ఏ నమూనాలోని స్పెర్మ్ ముందుగా ఫినిష్ లైన్‌ను చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తారు.

పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధికం అయ్యాయి. మారుతున్న జీవన సరళి, ఆహారపు అలవాట్లు.. తదితర కారణాల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుంది. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు ఈ స్పెర్మ్ రేస్ ను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. పురుషులు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి.. సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. ఈ రేస్ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని కూడా కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ స్పెర్మ్ రేస్ స్టార్టప్ సంస్థను లాస్ ఏంజెల్స్ లో ఏరిక్ జూ, నిక్ స్మాల్, షేన్ ఫ్రాన్, గ్యారెట్ నికోనెంకో సభ్యులు ఏర్పాటు చేశారు. 1973 నుంచి 2018 మధ్య పురుషుల సంతానోత్పత్తి రేటు 50 శాతం కంటే అధికంగా పడిపోయినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో స్పెర్మ్ రేస్ అనే సంస్థను స్థాపించి పురుషుల్లో సంతానోత్పత్తిపై అవగాహన కల్పించనున్నారు.












Click it and Unblock the Notifications