రెబెల్స్ చేతుల్లో సిరియా- అధ్యక్షుడి పరార్..!!

Syrian Civil War: సిరియాలో కొద్దిరోజుల కిందట ఆరంభమైన అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు, మిలీషియా గ్రూపులు ఉమ్మడిగా అక్కడి ప్రభుత్వాన్ని కూలగొట్టారు. రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో దేశాధ్యక్షుడు బషర్ అల్- అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియరావట్లేదు. ఇరాక్‌కు పారిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారింంచారు. కుటుంబ సభ్యులతో కలిసి సిరియా ఉత్తర ప్రాంతం మీదుగా సరిహద్దులను దాటుకుని ఉంటాడని చెబుతున్నారు.

Rebel forces in Syria have declared Damascus free after claiming Bashar al-Assad has fled

బషర్ అల్-అస్సాద్ కుటుంబం అయిదు దశాబ్దాల పాటు సిరియాను పరిపాలిస్తూ వచ్చింది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఆయన ప్రభుత్వం పతనం అయింది. చివరికి దేశం విడిచి పారిపోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారాయన.

కొద్దిరోజులుగా సిరియాలో అంతర్యుద్ధం రాజుకున్న విషయం తెలిసిందే. తిరుగుబాటుదారులు ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటూ వచ్చారు. రెండో అతిపెద్ద నగరం అలెప్పోను స్వాధీనం చేసుకోవడంతోనే వారి ఆదిపత్యం స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత యధేచ్ఛగా కొనసాగింది.

రెబెల్స్ ధాటికి సనా, హమా, హామ్స్ నగరాలను కోల్పోయింది సిరియా సైన్యం. పలు రీజియన్లు ప్రభుత్వ నుంచి చేజారాయి. అవన్నీ కూడా తిరుగుబాటులదారుల నియంత్రణలోకి వెళ్లాయి. శనివారం రాత్రికి రాజధాని డమాస్కస్‌‌కూ చేరుకున్నాయి రెబెల్ గ్రూప్స్. హామ్స్‌ను చేజిక్కించుకున్న తరువాత ఆయా బలగాలన్నీ కూడా రాజధానికి సమీపించాయి. శివారు ప్రాంతాలను చుట్టుముట్టాయి.

Rebel forces in Syria have declared Damascus free after claiming Bashar al-Assad has fled

రాజధాని శివార్లలో బర్జే, అల్- అస్సాద్ సబ్ అర్బ్, అల్- టాల్, మార్బా, ఇర్బిన్ వంటి ప్రాంతాల్లో మాటువేశాయి మిలీషియా గ్రూపులు. మౌంట్ కాసియాన్ వైపు కదిలాయి. ఎలాంటి ప్రతిఘటన అనేదే లేకుండా డమాస్కస్‌లో అడుగు పెట్టాయి. రావడం రావడంతోనే ఎయిర్‌పోర్ట్‌ను సీజ్ చేశాయి.

తిరుగుబాటుదారుల దెబ్బకు సిరియన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది. రష్యా, ఇరాన్ వంటి బలమైన దేశాల సైనిక సహాకారాన్ని అందిస్తోన్నప్పటికీ చేష్టలుడిగిపోవాల్సి వచ్చింది. తిరుగుబాటుదారులు ముందుకు దూసుకొస్తోన్న కొద్దీ ఆర్మీ.. వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక్కో నగరాన్నీ ఖాళీ చేసింది.

హామ్స్, హమా, సనా వంటి నగరాల్లో ఏర్పాటుచేసిన బషర్ అల్ అస్సాద్ విగ్రహాలను తిరుగుబాటుదారులు కూల్చివేశారు. తాళ్లతో కటిని నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ సొంత పతాకాన్ని రెపరెపలాడించారు. అక్కడి ప్రభుత్వ భవనాలు, ఇతర కార్యాలయాలపై వాటిని ఎగురవేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+