పాకిస్థాన్ లో సంచలనం.. కొత్త పార్టీ స్థాపించిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య..

పాకిస్థాన్ లో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ నూతన పార్టీని ప్రారంభించారు. పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ (PRP) అని నామకరణం చేశారు. ఇది ప్రజల పార్టీ అని తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న నిరాశ, కుటుంబ రాజకీయాలను అంతం చేయడమే తమ పార్టీ ప్రధాన ఎజెండా అని ఈ మేరకు రెహమ్ ఖాన్ స్పష్టం చేశారు. దేశంలోని యువత సపోర్ట్ తమకే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీని ప్రకటించారు. పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ (PRP) అని నామకరణం చేశారు. ప్రజల సమస్యలపై పోరాడటమే లక్ష్యంగా పార్టీని స్థాపించానని, రాజకీయాలను సేవగా మార్చేందుకే ఈ ఉద్యమమని ఆమె పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న నిరాశ, కుటుంబ రాజకీయాలను అంతం చేయడమే తన ప్రధాన ఎజెండా అని రెహమ్ ఖాన్ స్పష్టం చేశారు. ఇది ప్రజల పార్టీ అని.. ప్రజా ఉద్యమ పార్టీ అని తెలిపారు.

Reham Khan Launches Pakistan Republic Party Marking Bold Entry into Politics

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో పీటీఐ పార్టీ ఏర్పాటు చేసి ప్రధాని అయ్యారు. అయితే వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో ఆయన ఇమ్రాన్ ఖాన్ రెండేళ్లుగా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ (PRP) పేరిట సొంత పార్టీ పెట్టడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమె గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు. రచయిత కూడా కావడం గమనార్హం.

మరోవైపు పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనకేదైనా జరిగితే పాక్ ఆర్మీ చీఫ్‌ అసీమ్ మునీర్‌ దే బాధ్యత అని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు పీటీఐ పార్టీ సభ్యులకు ఇదే విషయాన్ని తెలిపారు ఇమ్రాన్ ఖాన్. అయితే ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+